Viral: శాండ్‌విచ్ ఆర్డర్ పెట్టిన మహిళ.. తీరా ప్యాకెట్ విప్పి చూడగా.. దెబ్బకు ఫ్యూజులౌట్!

|

Aug 19, 2022 | 6:00 PM

ఇంటికొచ్చిన ప్యాకెట్ విప్పి చూడగా.. మాకు ఒక్కసారిగా షాక్ తగిలింది. శాండ్‌విచ్ మధ్యలో ఏముందా అని చూస్తే..

Viral: శాండ్‌విచ్ ఆర్డర్ పెట్టిన మహిళ.. తీరా ప్యాకెట్ విప్పి చూడగా.. దెబ్బకు ఫ్యూజులౌట్!
Huge Knife In Sandwich
Follow us on

ఇంట్లో ఏదీ లేకపోయినా.. వండుకోవడానికి బద్దకమేసినా.. వెంటనే మనం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం. సరిగ్గా ఇక్కడొక మహిళ కూడా ఇదే పని చేసింది. తన ఇంటికి దగ్గరలో ఉన్న సబ్‌వే రెస్టారెంట్‌లో శాండ్‌విచ్ ఆర్డర్ పెట్టింది. ఫుడ్ ఆర్డర్‌ కూడా ఇంటికొచ్చింది. ఇంకేంటి ఆలస్యం.. పదండి తినదాం అనుకుంది.. దెబ్బకు ఓపెన్ చేయగానే దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంతకీ ఆ కథేంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌లోని సఫోల్క్ కౌంటీకి చెందిన 21 ఏళ్ల నేరిస్ మోయ్స్.. 2 వారాల క్రితం స్థానికంగా ఉన్న సబ్‌వే రెస్టారెంట్ నుంచి శాండ్‌విచ్ ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ ఇంటికొచ్చింది. ఇక తినదాం అని సిద్దం కాగా.. శాండ్‌విచ్ లోపల ఎల్లో కలర్ హ్యాండిల్‌తో ఓ కత్తి దర్శనమిచ్చింది.

“నేను నా భాగస్వామితో కలిసి ఉంటున్నాను. నేను గర్భవతి కావడంతో.. ఎక్కువగా ఆకలేస్తూ ఉండేది. అందుకే నా పార్టనర్ అతడి ఫోన్ ద్వారా సబ్‌వే నుంచి శాండ్‌విచ్ ఆర్డర్ పెట్టాడు. ఇంటికొచ్చిన ప్యాకెట్ విప్పి చూడగా.. మాకు ఒక్కసారిగా షాక్ తగిలింది. శాండ్‌విచ్ మధ్యలో ఏముందా అని చూస్తే.. ఎల్లో కలర్ హ్యాండిల్‌తో ఓ కత్తి దర్శనమిచ్చింది.” అని సదరు మహిళ పేర్కొంది. ఈ ఘటన జరిగిన వెంటనే సదరు మహిళ సబ్‌వే రెస్టారెంట్‌ నుంచి క్షమాపణ కోరింది.

కాగా, దీనిపై సబ్‌వే రెస్టారెంట్ సిబ్బంది స్పందించారు. కస్టమర్ల ఆరోగ్యం, భద్రత తమకు అన్నింటికంటే ముఖ్యమైనదని.. అందుకోసమే ఎల్లప్పుడూ అధిక ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తామని పేర్కొంది. ఈ ఘటనపై తమకు సమాచారం అందిన వెంటనే క్షుణ్ణంగా పరిశీలించాం. కస్టమర్‌కు కలిగిన ఇబ్బందికి క్షమాపణ కూడా కోరాం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని సబ్‌వే ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..