Viral Video: జాకీ చాన్‏ను మించి పోయిన పావురం.. వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు..

|

Jan 22, 2022 | 11:18 AM

ఇటీవల సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు తెగ సందడి చేస్తుంటాయి. అవి చేసే అల్లరి చేష్టలు

Viral Video: జాకీ చాన్‏ను మించి పోయిన పావురం.. వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు..
Viral
Follow us on

ఇటీవల సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు తెగ సందడి చేస్తుంటాయి. అవి చేసే అల్లరి చేష్టలు నవ్వులు పూయిస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు జంతువులు.. పక్షులు చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెటిజన్లు బాగా ఇష్టపడుతుంటారు. ఏనుగులు, జింకలు, సింహాలు, చిరుతలు.. పావురాలు.. ఇలా ఒక్కటేమిటీ అన్ని జంతువులు.. పక్షులకు సంబంధించిన ఫన్నీ వీడియోస్ మనం నెట్టింట్లో అనేకం చూసి ఆనందిస్తుంటాం. ప్రస్తుతం ఓ పావురంకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులో అది జాకీ చాన్‏ను మించిపోయి మరీ పల్టీలు కొట్టేస్తుంది.

ఆ వీడియోలో ఒక చోటు పావురాలు అనేకం ఉన్నాయి. అందులో ఓ పావురం ఉన్నట్టుండి పల్టీలు కొట్టడం ప్రారంభించింది. అలా ఒక్కసారి కాదు.. దాదాపు మూడు నాలుగు సార్లు వెనకకు పల్టీలు కొడుతూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా చాలా మంది ముందుకు పల్టీలు కొట్టేస్తుంటారు. వెనకకు పల్టీలు కొట్టడమనేది చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ ఈ పావురం మాత్రం అవలీలగా వెనకకు పల్టీలు కొట్టేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వీడియో నుంచి చూసిన నెటిజన్స్ వావ్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ .. జాక్ చాన్‏ను మించిపోయి మరీ పర్ఫామెన్స్ చేస్తున్న పావురం వీడియోను మీరు చూసేయ్యండి.

వీడియో..

Also Read:  Varalxmi Sarathkumar: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. పాన్ ఇండియా సినిమాలో జయమ్మ..

Malli Modalaindi: డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’.. ఎప్పుడు.. ఎందులో అంటే..?

Mahesh Babu: మ‌హేష్‌ను సేవ‌ వైపు మ‌ళ్లించిది ఆ సంఘ‌ట‌నే.. బాల‌య్య షోలో సూప‌ర్ స్టార్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.

RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్‌డేట్‌.. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన యూనిట్‌.. కానీ..