Viral Video: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సిస్టర్‌లా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

అమీనా రియాజ్... ఒకప్పుడు రోటీ చేస్తూ తన అందమైన చిరునవ్వుతో నెటిజన్లను ఆకట్టుకుంది. పొరుగు దేశం పాకిస్థాన్‌కు చెందిన అమీనా రియాజ్ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యిందో తెలుసుకుందాం పదండి.

Viral Video: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సిస్టర్‌లా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
Beautiful Roti Making Girl

Updated on: Dec 01, 2021 | 11:22 AM

అమీనా రియాజ్… ఒకప్పుడు రోటీలు చేస్తూ తన అందమైన చిరునవ్వుతో నెటిజన్లను ఆకట్టుకుంది. పొరుగు దేశం పాకిస్థాన్‌కు చెందిన అమీనా రియాజ్ స్పెషాలిటీ ఏంటంటే,  మేకప్, కాస్ట్లీ డ్రస్‌లు లేకుండా కూడా అందంగా కనిపించడం. ఈ గొప్ప క్వాలిటీతోనే ఆమె నెట్టింట సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో అమీనా వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయి కొత్త వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. అమీనా తాజా వీడియోలో బంగాళాదుంపలు కోస్తూ కనిపించింది.

15 ఏళ్ల అమీనా పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని కరాచీ శివార్లలో నివసిస్తుంది. సంచార కుటుంబానికి చెందిన ఆమె చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతోంది. ఆమె ఇంటి పక్కన నివశించే ఓ కుర్రాడు.. అమీనా అందానికి ముగ్ధుడై.. వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి నుంచి ఈ టీనేజర్ వీడియోల కోసం జనాలు సెర్చింగ్ మొదలుపెట్టారు. తాజా వీడియోలో అమీనా.. చిన్న నవ్వుతో బంగాళాదుంపలు కట్ చేయడం మీరు చూడవచ్చు.  ప్రజలు ఈ వీడియోను బాగా లైక్ చేస్తూ.. సో బ్యూటీఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో aamu_5 అనే అకౌంట్‌లో పోస్ట్ చేవారు. వీడియోలో అమీన్ మల్టీ కలర్ సల్వార్ సూట్ ధరించి ఉండడాన్ని మీరు చూడవచ్చు. ఆమె నవ్వుతూ బంగాళదుంపలు కోస్తూ కనిపిస్తుంది. వీడియోలో, మరొక అమ్మాయి ఆమెకు బంగాళాదుంపలు కట్ చేయడంలో సహాయం చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 80 వేల మంది లైక్ చేశారంటేనే ఈ వీడియో ఎంత ట్రెండ్ అవుతుందో అంచనా వేయవచ్చు. మొత్తంమీద, ఈ పాకిస్థానీ అమ్మాయి తన సింప్లిసిటీ, అందమైన చిరునవ్వుతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Also Read: Sirivennela Sitaramasastri: సిరివెన్నెలకు గూగుల్ ఘన నివాళి.. ఎమోషనల్ ట్వీట్..

Sirivennela Sitaramasastri: కంటతడి పెట్టిస్తున్న సిరివెన్నెల చివరి ఫోన్ కాల్..