
జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో చాలా వరకు ఫన్నీగా ఉంటాయి. వాటి తెలివి, అవి చేసే పనులు, అల్లరి చేష్టలు, కొంటె పనులు విపరీతంగా ఆకట్టుకుంటాయి. అందుకే నెటిజన్లు సైతం అవి చేసే పనులకు మురిసిపోతూ.. వీడియోలను మళ్లీ మళ్లీ షేర్ చేయడం, చూడటం చేస్తుంటారు. తాజాగా అలాంటిదే సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్లు షాక్‌తో నోరెళ్లబెడుతున్నారు. మనుషులే కాదు.. వారికి మించి ఉంది ఈ చిలుక అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
చాలా మందికి జంతువులు, పక్షులను పెంచడం హాబీ. కొందరు కుక్కలను, మరికొందరు కుందేళ్లను పెంచుకుంటారు.. ఇక చిలుకలను పెంచుకునే వారి సంఖ్య చాలా ఎక్కువ. చిలుకకు శిక్షణ ఇచ్చి తమ కుటుంబంలో సభ్యునిగా మార్చుకుంటారు. తాజాగా వైరల్ అవుతున్న చిలుక మామూలు చిలుక కాదు. అందరి ఊహలకు అందని చిలుక. ఈ చిలుక మనుషులు ఎలాగైతే ఫోన్‌ను ఆపరేట్ చేస్తారో.. అంతకు మించి ఆపరేట్ చేస్తుంది. వాట్సాప్‌లో చాట్ చేస్తోంది. తనకు నచ్చిన వారితో చాట్ చేయడం, వీడియో కాల్స్ మాట్లాడటం దీనికి చాలా సరదా అట. చిలుక వాట్సాప్ చాట్, వీడియో కాల్ కు సంబంధించిన వీడియోను దాని యజమాని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. అది చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మరింత ఆనందంతో షేర్ల మీద షేర్స్ చేస్తున్నారు.
ఈ వీడియోలో చిలుక వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపుతుంది. వాట్సాప్ చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఒక అమ్మాయితో చాట్ చేస్తుంది. అవతలి వైపు నుంచి మెసేజ్ రావడమే ఆలస్యం చకచకా రిప్లై ఇచ్చేస్తుంది. అంతేకాదు.. వారికి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది కూడా. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు కొన్ని వేల మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. చిలుక అల్లరిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
कितना Talented है ये तोता ?? pic.twitter.com/Z5Y2fQPKhj
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 3, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..