Viral Video: కేర్ టేకర్‏ను ఓ ఆటాడుకుంటున్న పాండాస్.. వైరలవుతున్న వీడియో..

ఆ వీడియోలో ఓ జూలోని పాండాస్ కేర్ టేకర్.. అవి ఉన్న ప్రదేశాన్ని క్లీన్ చేస్తున్నాడు. అక్కడే ఉన్న ఓ పాండా కేర్ టేకర్ కాళ్లు పట్టుకుని అతను నడవకుండా చేస్తుంది.

Viral Video: కేర్ టేకర్‏ను ఓ ఆటాడుకుంటున్న పాండాస్.. వైరలవుతున్న వీడియో..
Viral

Updated on: Jul 31, 2022 | 8:04 PM

మనుషులతో కొన్ని జంతువులు ప్రవర్తించే తీరు నవ్వులు తెప్పిస్తుంటాయి. అలాగే మరికొన్ని సందర్భాల్లో మనం పెంచుకునే కుక్కలు, పిల్లులు, కోతులు మనపై చెప్పలేనంత అభిమానాన్ని చూపిస్తుంటాయి. అంతేకాదు కొన్నిసార్లు మనతో గొడవపడుతుంటాయి. అల్లరి చేస్తుంటాయి. కోపం తెప్పిస్తాయి. తాజాగా కొన్ని పాండాలు తమ కేర్ టేకర్‏ను ఓ ఆటాడుకున్నాయి. అతడిని ముందుకు వెళ్లనివ్వకుండా కాళ్లకు అడ్డుపడుతూ సరదాగా గొడవ పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో ఓ జూలోని పాండాస్ కేర్ టేకర్.. అవి ఉన్న ప్రదేశాన్ని క్లీన్ చేస్తున్నాడు. అక్కడే ఉన్న ఓ పాండా కేర్ టేకర్ కాళ్లు పట్టుకుని అతను నడవకుండా చేస్తుంది. అంతేకాకుండా అతడి వీపైపైకి ఎక్కిందేకు ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని పాండాస్ వచ్చి అతడి కాళ్లను పట్టుకుని ముందుకు వెళ్లకుండా ఆపేస్తున్నాయి. అతను ఏ పనిచేయకుండా ఉండేందుకు ఆ పాండాస్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో నెటిజన్స్ కేర్ టేకర్ ఉద్యోగం కావాలని.. పాండాలు సరదగా ఆడుకుంటున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us