Optical Illusions: అసలు సిసలైన బ్రెయిన్ టీజర్.. ఈ ఫోటోలో ఎన్ని పిల్లులు దాగున్నాయో చెప్పగలరా? 99% ఫెయిల్ అయ్యారు..!

|

May 02, 2023 | 10:20 AM

Optical Illusions: ఆప్టికల్ భ్రమలు సోషల్ మీడియాలో లేటెస్ట్ ట్రెండ్స్. ఈ పజిల్స్ మిమ్మల్ని గందరగోళానికి గురిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు మీ మెదడును దాని పరిమితులకు పరీక్షించగలవు. వారి పన్ను విధించే ప్రయత్నాలు ఉన్నప్పటికీ, ఆప్టికల్ భ్రమలు సోషల్ మీడియా వినియోగదారులలో ప్రసిద్ధి చెందాయి. ఈ మెదడు టీజర్‌లు మీ దృష్టి మరియు జ్ఞాపకశక్తి నైపుణ్యాలను

Optical Illusions: అసలు సిసలైన బ్రెయిన్ టీజర్.. ఈ ఫోటోలో ఎన్ని పిల్లులు దాగున్నాయో చెప్పగలరా? 99% ఫెయిల్ అయ్యారు..!
Optical Illusion
Follow us on

ఆప్టికల్ ఇల్యూజన్స్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. గందరగోళానికి గురి చేసే ఈ పజిల్స్‌ను చేధించడంలో మాంచి కిక్కు వస్తుంది. అందుకే.. నెటిజన్ల ఆదరణ పొందుతున్నాయి. చూసేందుకు చాలా ఈజీగా ఉన్నప్పటికీ.. ఆన్సర్ చెప్పడానికి ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే వాటిలో అంత కిక్కు ఉంటుంది. తాజాగా అలాంటి గజిబిజి గందరగోళం క్రియేట్ చేసే ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దానిలో దాగున్న రహస్యాన్ని కనిపెట్టలేక కన్‌ఫ్యూజ్ అవుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆ ఫోటో ఏంటి? అందులో ఉన్న కన్‌ఫ్యూజన్ ఏంటి? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు మీకోసం..

ఇదీ టాస్క్..

‘మీరు కనిపెట్టగలరా?’ అంటూ ఓ పిల్లికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ ఫోటోలో అంత రహస్యం ఏముంది? ఎందుకింత ఆసక్తి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి ఇందులో ఓ ఆరెంజ్ కలర్‌ పిల్లి దర్జాగా కూర్చుని ఉంది. దాని పక్కన నల్లటి షాడో ఉంది. అయితే, అక్కడ మరో పిల్లి నిల్చుని ఉందా? లేక షాడో నా? అనేది చెప్పడమే మీ టాస్క్. కింద ఫోటోను ఇవ్వడం జరిగింది. దానిని చూసి ఆన్సర్ చెప్పాలి. చాలా మంది దీనిని కనిపెట్టడంలో విఫలమయ్యారు. మరి మీరు ట్యాలెంట్ అయితే, మీరు బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుందని మీరు విశ్వసిస్తే.. 5 సెకన్లలో ఇందులో దాగున్న రహస్యమేంటో కనిపెట్టాలి. దీనిని కనిపెడితే నిజంగా మీరు ఖతర్నాక్ అని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

ఏంటీ ఆన్సర్ కనిపెట్టలేదా?

ఈ ఫోటో గందరగోళానికి గురి చేస్తున్నప్పటికీ.. ఇందులో ఇంట్రస్టింగ్ పజిల్ దాగుంది. వాస్తవానికి అక్కడ రెండు పిల్లులు ఉన్నాయి. ఒకటి ఆరెంజ్ కలర్ పిల్లి, మరొకటి బ్లాక్ కలర్ పిల్లి. రెండు పిల్లులు పక్క పక్కనే కూర్చున్నాయి. చూడటానికి మాత్రం ఆరెంజ్ పిల్లి షాడో మాదిరిగానే ఉన్నా.. వాస్తవంగా మాత్రం అక్కడ రెండు పిల్లులు ఉన్నాయి. ఒకవేళ నీడ అనుకున్నట్లయితే ఆరెంజ్ పిల్లికి, ఆ బ్లాక్ కలర్ షాడోకు మధ్య గ్యాప్ ఉండకూడదు. కానీ, అక్కడ గ్యాప్ ఉంది. దాన్నిబట్టే ఈజీగా అవి రెండూ వేరు వేరు పిల్లులు అని చెప్పేయొచ్చు.

కింద ఫోటోను చూడొచ్చు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..