
తల మాయం.. మిగిలింది మొండం.. బస్సులో ప్రయాణం.. ఓ వ్యక్తి తల లేకుండా బస్సులో ప్రయాణించడం సాధ్యమేనా.? ఇదేం పిచ్చి ప్రశ్న అని అనుకునేరు. పైన ఫోటోను గమనించారా.! ఓ తల లేని మొండం బస్సులో ప్రయాణిస్తోందని అనుకుంటే పొరపాటే.. మీ కళ్ల ముందు కనిపించేది అంతా నిజమే.. కానీ అదంతా నమ్మలేకుండా ఉంటుంది. ఇది అసలు సాధ్యమేనా..? ఇదంతా మ్యాజిక్ అనుకోకండి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. మీ కళ్లకు పదునుపెట్టడమే కాకుండా.. వాటికి సవాల్ విసురుతాయి. ఉన్న నిజాన్ని చూపించవు.. కానీ అందులో లేని అబద్దాన్ని ప్రతిబింబిస్తాయి. పైన పేర్కొన్న ఫోటోను చూసి కొందరు అదంతా గ్రాఫిక్స్ అని కొట్టిపారేస్తే.. మరికొందరు తెలివిగా బొమ్మలో ఉన్న కిటుకును కనిపెట్టేశారు.
ఈ ఫోటోలో ఎలాంటి మాయాజాలం ఏం లేదని.. విండోను కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు మనిషి తల కనిపిస్తుందని చాలామంది కామెంట్స్ రూపంలో తేల్చేశారు. ఆ వ్యక్తి తలను పూర్తిగా కిటికీ వైపు వాల్చేసి పడుకున్నాడని అంటున్నారు. కాగా, ప్రసుతం ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
Just a guy wearing a hoodie
by u/zaferemre in confusing_perspective
Comment
by u/trash666777 from discussion Just a guy wearing a hoodie
in confusing_perspective
Comment
by u/PM_ME_GOOD_VIBES_ from discussion Just a guy wearing a hoodie
in confusing_perspective