Viral: ఈ చిత్రంలో ఏనుగు దాగుంది.. 10 సెకన్లలో కనుగొంటే మీరు తోపులే.. ట్రై చేయండి..

|

Jul 26, 2022 | 4:16 PM

చాలా మంది ఫోటోగ్రాఫర్‌లు అందులో రహస్యం దాగి ఉండేలా డిజైన్ చేస్తుంటారు. వాటిని కనుగొవాలంటూ సవాల్ విసురుతారు. తాజాగా నెట్టింట ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో వైరల్ అవుతోంది.

Viral: ఈ చిత్రంలో ఏనుగు దాగుంది.. 10 సెకన్లలో కనుగొంటే మీరు తోపులే.. ట్రై చేయండి..
Optical Illusion
Follow us on

Optical illusion: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో విషయాలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ వంటి గేమ్‌లను యూజర్లు బాగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఆప్టికల్ ఇల్యూషన్‌కు సంబంధించిన చాలా చిత్రాలు మన కళ్లను మోసగించేలా ఉంటాయి. అందుకే చాలామంది వీటికి సంబంధించిన అనేక చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. వీటిని పరిష్కరించడానికి కూర్చుంటే ఈజీగా టైంపాస్ అవుతుంది. ఇంకా ఇవి మన మెదడుకు వ్యాయామంగా మార్చి.. మనస్సును ఫిట్‌గా ఉంచడానికి దోహదపడతాయి. ఈ చిత్రాల ప్రత్యేకత ఏంటంటే.. మన కళ్ల చూపును కూడా పదును పెడతాయి కూడా. చాలా మంది ఫోటోగ్రాఫర్‌లు అందులో రహస్యం దాగి ఉండేలా డిజైన్ చేస్తుంటారు. వాటిని కనుగొవాలంటూ సవాల్ విసురుతారు. తాజాగా నెట్టింట ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో వైరల్ అవుతోంది. అందులో చెరువుతోపాటు చాలా బాతులు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఎప్పటిలాగే ఇందులో ఏదో దాగి ఉంది.. మీరు దానిని 10 నిమిషాలలో కనుగొంటే జీనియస్ అంటూ పేర్కొంటున్నారు.

చిత్రంలో ఏనుగు..

ఈ చిత్రంలో బాతులతోపాటు ఓ ఏనుగు కూడా ఎక్కడో నిలబడి ఉంది. కానీ ఎవరైనా దాన్ని కనుగొని చూపించడం సరదాగా ఉంటుంది. ఈ చిత్రం అన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలపై భారీగా పడింది. ఎందుకంటే అందులో దాగి ఉన్న మిస్టరీని ఛేదించడంలో అందరూ విఫలమవుతున్నారు. దీన్ని పరిష్కరించడానికి మేము మీకు 10 సెకన్లు ఇచ్చాము. మీరు కూడా ఏనుగును కనుగొని చూపిస్తే మీరు మాస్టర్ అని పేర్కొన్నాడు ఓ యూజర్..

ఇవి కూడా చదవండి

ఒక్కసారి చూడండి ఏనుగు కనిపిస్తుంది..

Viral Photo

మొదటి చూపులో ప్రతి ఒక్కరూ చెరువు, చాలా బాతులు ఉండటాన్ని చూడవచ్చు. కానీ ఎక్కడో ఏనుగు దాగి ఉంది. నిరుత్సాహపడకండి, దాన్ని కనుగొనడంలో మేము కూడా మీకు సహాయం చేస్తాం. మీరు చెరువుకు చివరి వైపు చూస్తే అక్కడ మీకు ఏనుగు కనిపిస్తుంది. చాలా మంది కళ్ళు బాతుల వైపు మాత్రమే ఉన్నాయి.. అందుకే అవి ఏనుగును చేరుకోలేకపోతున్నాయని పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..