Optical Illusion: కిరాక్ మామ.. కిరాక్.. పిల్లిని కనిపెడితే మీరు తోపులే.. టైం 10 సెకన్లే..

తక్కువ సమయంలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో దాగున్న విషయాలను గుర్తిస్తే.. మన చూపు, మైండ్ షార్ప్‌గా ఉన్నట్లు పేర్కొంటారు. తాజాగా అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో ఒకటి మీ ముందుకు తీసుకువచ్చాం.. ఈ ఫొటోలో పిల్లి దాగుంది.. అదెక్కడుందో కనిపెట్టడం టాస్క్..

Optical Illusion: కిరాక్ మామ.. కిరాక్.. పిల్లిని కనిపెడితే మీరు తోపులే.. టైం 10 సెకన్లే..
Optical Illusion Test

Updated on: Dec 08, 2025 | 7:28 PM

సోషల్ మీడియా ప్రపంచంలో అనునిత్యం ఎన్నో ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ రూటే వేరు.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు నెటిజన్లను సవాల్ విసురుతుంటాయి.. ఆ ఫొటోల్లో చూడటానికి ఏం లేనట్టు కనిపిస్తూనే.. మన కళ్లను మోసం చేస్తుంటాయి.. వీటిల్లో ఎన్నో విషయాలు దాగుంటాయి కానీ.. కనిపించవు.. చాలా మంది వీటిలో దాగున్న విషయాలను కనుగునేందుకు ఆసక్తి చూపుతుంటారు.. అలాగే.. వారి స్నేహితులకు సవాల్ చేస్తుంటారు.. వీటి ద్వారా మన మైండ్ ఎంత షార్ప్ గా ఉందనేది అర్థమవుతుందని చెబుతుంటారు. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్ ఉత్సాహాన్ని నింపడంతోపాటు విశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు. వాస్తవానికి ఎక్కువ సమయం తీసుకోకుండా ఆప్టికల్ భ్రమను పరిష్కరించడం చాలా మందికి సాధ్యం కాదు. అయితే, తక్కువ సమయంలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో దాగున్న విషయాలను గుర్తిస్తే.. మన చూపు, మైండ్ షార్ప్‌గా ఉన్నట్లు పేర్కొంటారు. తాజాగా అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో ఒకటి మీ ముందుకు తీసుకువచ్చాం.. ఈ ఫొటోలో పిల్లి దాగుంది.. అదెక్కడుందో కనిపెట్టడం టాస్క్..

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో రాళ్లు.. చెట్లు.. పొదలు కనిపిస్తున్నాయి. కానీ, ఈ ఫొటోలో ఒక పిల్లి కూడా దాగుంది.. ఈ ఫొటోను క్షణ్ణంగా పరిశీలిస్తే కానీ.. మన కంటికి కనిపించదు. అయితే, ఇప్పుడు ఈ ఫొటోలోని పిల్లిని 10 సెకన్లలో కనిపెట్టాలి.. ఒకసారి ఈ కింద ఇచ్చిన ఫొటోను చూడండి..

Optical Illusion Test

సాధారణంగా పిల్లి అక్కడున్న పరిసరాలతో కలిసిపోతుంది. అందుకే.. అంత ఈజీగా కనిపెట్టడం సాధ్యం కాదు.. పిల్లి.. బండ రాళ్లు, చెట్ల మధ్య దాక్కుని ఉంది.. ఇది మొదటి చూపులో గుర్తించడం కష్టమే.. అందుకే మరోసారి ఈ ఫొటోపై లుక్కెయండి.. తదేకంగా చూస్తే మీకు కనిపిస్తుంది..

Optical Illusion Photo

మీరు ఇంకా పిల్లిని గుర్తించలేకపోతే.. ఇక్కడ కింద ఇచ్చిన ఫొటోను చూడండి..

Cat Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..