ఆప్టికల్ ఇల్యూజన్స్‌లో బ్రెయిన్ టీజర్స్‌కి సోషల్ మీడియాలో ఎక్కడలేని అట్రాక్షన్ ఉంది. మెదడుకు మేత పెట్టే ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. పదాలకు సంబంధించిన వర్డ్ ఆప్టికల్ ఇల్యూజన్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అన్ని పదాలు ఒకేలా కనిపిస్తాయి.? కానీ అందులో ఓ డిఫ్రంట్ వర్డ్ ఎక్కడో దాగి ఉంటుంది. దాన్ని కనిపెట్టడమే ఇలాంటి పజిల్స్ ముఖ్య ఉద్దేశం.
అయితే ఎలాంటి సమయ నిబంధనలు లేకపోతే గుర్తించడం కొంత సులభం అవ్వొచ్చు. కానీ అలా కాకుండా కేవలం 10 సెంకడ్లలో కనిపెట్టమని సవాల్ విసిరితే అంత సులభం కాదు. తాజాగా చూసే కళ్లని గందరగోళానికి గురి చేసే ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్‌కు సంబంధించిన ఫొలో నెట్టింట తెగ సందడి చేస్తోంది. పైన కనిపిస్తోన్న ఫొటో చూడగానే ‘BASCBALL’ అనే పదం కనిపిస్తోంది కదూ! అయితే వీటి మధ్యే కరెక్ట్ స్పెల్లింగ్ అయినన ‘BASEBALL’ కూడా దాగి ఉంది.
మీ పజిల్‌ను మీరు సాల్వ్ చేయగలరేమో ఓసారి ట్రై చేయండి. కేవలం 10 సెకండ్స్‌లో సదరు వర్డ్‌ను గుర్తిస్తే మీ కంటి పవర్ షార్ప్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనిని సాల్వ్ చేయడం అంత సులభమైన విషయం మాత్రం కాదు. అన్ని పదాలు ఒకేలా కనిపిస్తోన్న వాటి నడుమ దాగున్న ఓ డిఫ్రంట్ వర్డ్‌ను గుర్తించడం కాస్త కష్టమనే చెప్పాలి. ఎంత ట్రై చేసినా పదాన్ని గుర్తించలేకపోతున్నారా? అయితే ఆన్సర్ కోసం కింద ఫొటోను చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..