చాలా మంది మంచి శరీరం, మెరుగైన ఆరోగ్యం కోసం రెగ్యూలర్‌గా వ్యాయమం చేస్తుంటారు. కొందరు జిమ్‌కు వెళ్తుంటారు. అక్కడ ట్రైనర్ ఎప్పటికప్పుడు ఏయే వ్యాయామం చేయాలి, ఏ పరికరాల్లో ఆ వ్యాయామం ఎలా చేయాలో తర్పిదు ఇస్తారు. అయితే ఈరోజు వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు వ్యాయామానికి ఉపయోగించే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. అవును, వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ ఇది నిజం ఒడిశాలోని రూర్కెలా నివాసి సుమిత్ సింగ్ ట్రెడ్‌మిల్‌పై 12 గంటల పాటు పరిగెత్తుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో తన పేరును లిఖించుకున్నాడు.
ఒడిశాకు చెందిన సుమిత్ మార్చి 12 ఉదయం 8:15 గంటలకు ట్రెడ్‌మిల్‌పై పరుగు ప్రారంభించాడు. ఆ తర్వాత, సుమిత్ 8:00 PM నుండి 20:00 PM వరకు ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తడం ద్వారా ఈ ప్రత్యేకమైన రికార్డును పూర్తి చేశాడు. అలాగే ట్రెడ్‌మిల్‌పై 12 గంటలపాటు నిరంతరం పరిగెత్తడం ద్వారా 68.04 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి.
ఇంతకుముందు సుమిత్ సింగ్ 25 ఏప్రిల్ 2023 నుండి 14 మే 2023 వరకు 33 మారథాన్‌లను పూర్తి చేశాడు. ఉదిత్‌నగర్ స్టేడియంలో 1392.6 కి.మీల అద్భుత దూరాన్ని అధిగమించి సుమిత్ క్రీడా రంగంలో విశేషమైన ఫీట్‌ని కనబరిచాడు. సుమిత్ తన అత్యుత్తమ ప్రదర్శనకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి సర్టిఫికేట్‌తో సత్కరించబడ్డాడు.
ఇది కాకుండా, సుమిత్ సింగ్ వద్ద అనేక సర్టిఫికేట్లు, పతకాలు కూడా ఉన్నాయి. ఈ వైరల్ వీడియో YouTube ఖాతా @sumitsinghultrarunner నుండి సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుడికి అభినందనలు తెలుపుతూ కామెంట్లు కుమ్మరిస్తున్నారు. ట్రెడ్‌మిల్‌పై నిరంతరాయంగా 12 గంటల పాటు పరిగెత్తిన సుమిత్ సింగ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..