మీలో చాలామందికి వెబ్‌సిరీస్‌లు అంటే ఇష్టముండొచ్చు. జోనర్ ఏదైనా గంటల తరబడి చూస్తుంటే.. ఈ ఆఫర్ మీకోసమే. ఓ స్ట్రీమింగ్ సర్వీస్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. 24 గంటలు ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలు చూస్తే లక్షల్లో జీతం ఇస్తుంది. అసలు ట్రూ క్రైమ్ అంటే ఏంటో తెలుసా.? నిజ జీవితంలో జరిగే నేరాలను ట్రూ క్రైమ్స్ అని అంటారు. కొందరు వీటిని ఆధారంగా చేసుకుని మూవీస్ తీసుకుంటే.. మరికొందరు డాక్యుమెంటరీలు తీస్తుంటారు. ఇక ఇలాంటి ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలను ప్రజలకు చేరేసేందుకు ఓ స్ట్రీమింగ్ సర్వీస్ అద్భుతమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. అది అలాంటి.. ఇలాంటి ఆఫర్ కాదండోయ్.. భారీ ఆఫర్ అని చెప్పాలి. తమ స్ట్రీమింగ్ సర్వీస్‌లో ప్రసారమయ్యే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలను 24 గంటలు చూసినవారికి రూ. 1.8 లక్షల జీతంగా ఇస్తామని ఆఫర్ ప్రకటించింది.
మగెల్లన్ టీవీ(Magellan TV) అనే డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ సర్వీస్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. గత మూడేళ్ళుగా ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ఈ ఆఫర్‌ను కొనసాగిస్తోంది. వారు ఎంచుకున్న అభ్యర్ధి 24 గంటల పాటు ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలను చూడటమే కాకుండా.. చూసిన వాటిపై అద్భుతమైన రివ్యూను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఈ టాస్క్ పూర్తి చేసినవారికి రూ. 1.8 లక్షల జీతం పాటు మగెల్లన్ టీవీ సబ్‌స్క్రిప్షన్ ఒక ఏడాది పాటు ఫ్రీగా లభిస్తుంది. అభ్యర్ధి తమ ఫ్లాట్‌ఫార్మ్‌పై ఏయే డాక్యుమెంటరీలు చూస్తున్నాడన్న దానిపై స్ట్రీమింగ్ సర్వీస్ నిఘా ఉంచుతుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం మగెల్లన్ టీవీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇక ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్ధులు.. “ఈ ఉద్యోగానికి ఎందుకు సరైనవారు” అని వివరించే ఓ వీడియోను సమర్పించాలి.