కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే, ఈ రాట్ ట్రాప్ టెక్నిక్ గురించి తెలుసుకోండి! ఎసీ, కూలర్ అవసరమే ఉండదు

ప్రస్తుతం ఎండలు 40 డిగ్రీలు దాటిపోవడంతో ఇళ్లల్లో ఉండటం కష్టంగా మారుతోంది. పగటిపూట గోడలు, పైకప్పు వేడెక్కడం వల్ల ఇల్లు కొలిమిలా తయారవుతుంది. అయితే, ఇల్లు నిర్మించేటప్పుడే రాట్ ట్రాప్ మేసన్రీ (Rat Trap Masonry) అనే ప్రత్యేక పద్ధతిని పాటిస్తే ఎండల నుండి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. ఇలా చేస్తే ఏసీ, కూలర్ల అవసరం లేకుండానే ఇళ్లను సహజంగా చల్లగా ఉంచుకోవచ్చు అంటున్నారు. అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాం..

కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే, ఈ రాట్ ట్రాప్ టెక్నిక్ గురించి తెలుసుకోండి! ఎసీ, కూలర్ అవసరమే ఉండదు
Rat Trap Masonry

Updated on: May 21, 2026 | 4:13 PM

ఎండలు ముదురుతున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత కేవలం బయటే కాదు, ఇళ్ల లోపల కూడా విపరీతంగా ఉంటోంది. పగటిపూట గోడలు, మిద్దెలు ఎండ వేడిని పీల్చుకోవడం వల్ల రాత్రి వేళల్లో కూడా ఇల్లు కొలిమిలా మారి ఉక్కపోత, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే, కొత్తగా ఇల్లు కట్టుకునే వారు ఒక ప్రత్యేకమైన నిర్మాణ సాంకేతికతను ఉపయోగిస్తే, ఏసీ, కూలర్ల అవసరం లేకుండానే ఇళ్లను సహజంగా చల్లగా ఉంచుకోవచ్చు. ఆ అద్భుతమైన పద్ధతే రాట్ ట్రాప్ మేసన్రీ (Rat Trap Masonry). అదేలాగో ఇప్పుడు చూద్దాం..

ఏమిటీ రాట్ ట్రాప్ మేసన్రీ టెక్నిక్?:

సాధారణంగా ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలను అడ్డంగా, ఒకదానిపై ఒకటి సమాంతరంగా అమర్చుతారు. కానీ, రాట్ ట్రాప్ మేసన్రీ పద్ధతిలో ఇటుకలను నిలువుగా (Vertical) అమరుస్తారు. ఇలా అమర్చడం వల్ల గోడ మధ్య భాగంలో కొంత ఖాళీ స్థలం ఏర్పడుతుంది. దీన్నే ఎయిర్ కేవిటీ (Air Cavity) అంటారు. ఈ ఖాళీ స్థలంలో ఉండే గాలి ఒక అద్భుతమైన ఇన్సులేటర్‌గా పనిచేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది బయటి తీవ్రమైన వేడిని నేరుగా ఇంటి లోపలికి ప్రసరించకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా, సాధారణ ఇళ్లతో పోలిస్తే ఈ పద్ధతిలో కట్టిన ఇళ్లు వేసవిలో చాలా చల్లగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఈ సాంకేతికత వల్ల కేవలం ఇల్లు చల్లగా ఉండటమే కాదు, జేబుకు కూడా చాలా లాభం చేకూరుతుంది. ఇటుకలను నిలువుగా పెట్టడం వల్ల ఇటుకల సంఖ్య, వాటిని అతికించే సిమెంట్-ఇసుక మిశ్రమం వాడకం చాలా తగ్గుతుంది. దీనివల్ల నిర్మాణ సామగ్రి ఖర్చులో దాదాపు 30 శాతం వరకు ఆదా అవుతుంది. అంతేకాకుండా, ఈ గోడలు చూడటానికి అందంగా ఉండటం వల్ల లోపల ప్లాస్టరింగ్ లేదా పెయింటింగ్ ఖర్చులు కూడా మిగులుతాయి.

అయితే, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రాట్ ట్రాప్ మేసన్రీ పద్ధతిని ఉపయోగించేటప్పుడు నాణ్యమైన, ఒకే పరిమాణంలో ఉన్న ఇటుకలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. గోడ మొదటి, చివరి వరుసలను చాలా బలంగా నిర్మించాలి. అనుభవజ్ఞులైన మేస్త్రీల పర్యవేక్షణలో ఈ పద్ధతిని పాటిస్తే, తక్కువ ఖర్చుతో పర్యావరణ అనుకూలమైన, వేసవి తాపాన్ని తట్టుకునే బలమైన ఇల్లు మీ సొంతమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us