
చీరకట్టు అనేది భారత సంప్రదాయం.. ఆడవారు చీరకట్టులో కనిపిస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. విదేశీలు కూడా మన చీరకట్టు సంప్రదాయానికి ముగ్ధులు అవుతుంటారు.. ఇతర దేశ స్త్రీలు కూడా చీర కట్టుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.. అలాంటిది ఇప్పుడు ఓ సంఘటన భారతీయులందరికి కోపం తెప్పిస్తుంది. చీరకట్టుకుంటే రెస్టారెంట్లోకి అనుమతి లేదని ఓ యాజమాన్యం రూల్ పెట్టడంతో ఇప్పుడు వివాదం రేగుతుంది. పోనీ అది వేరే దేశంలో కూడా కాదు మనదేశంలోనే ఇది జరగడం నిజంగా భారతీయులకు కట్టలు తెంచుకునే కోపాన్ని తెప్పిస్తుంది. దక్షిణ ఢిల్లీలోని ఓ మాల్లో ఉన్న రెస్టారెంట్లో చీరకట్టులో వచ్చిన ఓ మహిళను రానీయకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకరం రేపుతోంది. ఢిల్లీలోని అన్సల్ ప్లాజా అనే మాల్లోని రెస్టారెంట్‌కు ఓ మహిళ వెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ అధికారులతోపాటు అక్కడి మహిళా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు.
రెస్టారెంట్లోకి చీరకట్టు అనుమతి లేదని ఆ మహిళను అడ్డుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో ఆమె సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరికి ఆమెను మాత్రంలోనికి అనుమతించలేదు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై నెటిజన్లంతా విరుచుకుపడుతున్నారు. చీరకట్టు మన సంకృతి.. దానిని అవమానించడం దారుణం.. చీరకు ఉన్న చరిత్ర తెలియని భారతీయులు… సిగ్గుపడాల్సిన సంఘటన.. వెంటనే ఆ రెస్టారెంట్ ను మూసెయ్యాలి..చీర గొప్పదనం తెలియని మూర్ఖులు అంటూ మండిపడుతున్నారు.. వెంటనే ఆ రెస్టారెంట్ లైసెన్స్ ను క్యాన్సిల్ చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :