భూమి పొరల కింద ప్రవహించే అద్భుత నది.. ఆంధ్రప్రదేశ్ గుండా తమిళనాడులోకి.. అసలు కథ తెలిస్తే షాకే..!

Palar River Secrets: ప్రకృతి ప్రసాదించిన ఈ భూగర్భ వింత మన తెలుగు రాష్ట్రంతోపాటు పక్క రాష్ట్రాల్లోనూ ప్రవహించడం విశేషం. నీటి ఎద్దడిని తట్టుకోవడానికి, భూగర్భ జలాలను పెంపొందించడానికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ 'గుప్త గామిని' ప్రవాహం నిజంగా ఒక అద్భుతమే!

భూమి పొరల కింద ప్రవహించే అద్భుత నది.. ఆంధ్రప్రదేశ్ గుండా తమిళనాడులోకి.. అసలు కథ తెలిస్తే షాకే..!
Palar River

Updated on: Aug 10, 2026 | 1:54 PM

Palar River Secrets: భారతదేశంలో భూగర్భంలో ప్రవహించే వింతైన నది గురించి మీకు తెలుసా? పైన చూస్తే పొడి బారిన ఇసుక దిబ్బలు.. కింద చూస్తే నిరంతరం ప్రవహించే జలధారలు! తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహించే ఈ నది ప్రత్యేకతలు, దీనిని ‘క్షీర నది’ అని ఎందుకు పిలుస్తారో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

మన దేశంలో ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి. వాటిలో అత్యంత విచిత్రమైనది, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినది ‘పాలార్’ లేదా పాలారు నది. కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ నంది కొండల నుంచి ఈ నది తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అక్కడ నుంచి మొదలై ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడులోకి ప్రవేశించి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. దాదాపు 348 కిలోమీటర్ల పొడవునా సాగే ఈ ప్రవాహం అనేక ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందిస్తోంది.

ఎక్కువమంది చదివింది: ఒకటో రెండో కాదు.. ఏకంగా 97 నదులు పారే ఏకైక జిల్లా.. ఎక్కడో కాదు మనదేశంలోనే..?

ఇవి కూడా చదవండి

కంటికి కనిపించకుండా భూగర్భంలో పారే ‘గుప్త గామిని’

ఈ నదికి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఉపరితలంపై కంటే ఎక్కువగా భూమి పొరల కింద ఉన్న ఇసుక మార్గాల్లోనే ప్రవహిస్తుంది. సాధారణ రోజుల్లో పైన చూస్తే నది ఉన్న ఆనవాళ్లే కనిపించవు. కేవలం ఖాళీ ఇసుక తిన్నెలు మాత్రమే దర్శనమిస్తాయి. భూమి అంతర్భాగం నుంచి నిరంతరం ప్రవహించే గుణమున్నందుకే దీనిని నానుడిలో ‘గుప్త గామిని’ అని పిలుస్తారు. వర్షాకాలం రాగానే ఇసుక పొరల నుంచి నీరు పైకి ఉబికి వస్తుంది.

పాలు ఒలికినట్లు తెల్లగా ప్రకాశించే వెనుక రహస్యమిదే!

ఈ నదిని ‘పాల నది’ లేదా క్షీర నది అని పిలవడం వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ కారణం ఉంది. ఈ నది ఒడ్డున, అడుగుభాగంలో అత్యధికంగా తెల్లటి ఇసుక, క్వార్ట్జ్ ఖనిజం నిండి ఉంటాయి. తీవ్రమైన ఎండ కాసేటప్పుడు సూర్యకాంతి ఈ క్వార్ట్జ్ ఇసుకపై పడి వెలుగులు చిమ్ముతుంది. దూరపు నుంచి చూసినప్పుడు నది గర్భమంతా తెల్లటి పాలు ప్రవహిస్తున్నట్లు మెరిసిపోతూ కనిపిస్తుంది. వర్షాలు పడినప్పుడు నీటితో పాటు తేలికపాటి ఇసుక కొట్టుకురావడం వల్ల నీరు స్వచ్ఛమైన తెల్లటి రంగు సంతరించుకుంటుంది.

ఎక్కువమంది చదివింది: కేవలం తలుపులు తెరవడానికే అనుకుంటే పొరపాటే.. హోటల్ కీ కార్డ్ వెనుక ఇన్ని రహస్యాలు ఉన్నాయా..?

కోట్లాది మందికి జీవనాధారంగా మారిన జలనిధి..

తమిళనాడులోని వేలూర్, రాణిపేట, కాంచీపురం వంటి నగరాలకు ఈ నదే ప్రధాన తాగునీటి ఆధారంగా నిలుస్తోంది. ఉపరితలంపై ఇసుక ఎక్కువగా ఉండటం వల్ల వర్షపు నీటిని ఇంకింపజేసి ఇంజెక్షన్ బావిలా పనిచేస్తుంది. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరంతరం భూగర్భ జలాలు పుష్కలంగా లభిస్తాయి. బావులు, బోర్‌వెల్స్‌లో నీటిమట్టం తగ్గకుండా చూసే ఈ నదిని స్థానిక ప్రజలు ఒక ప్రత్యక్ష దైవంగా, కన్నతల్లిగా ఆరాధిస్తారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us