Viral Video: ఛీ.. ఛీ.. రెచ్చిపోయిన జంట.. నడి రోడ్డుపైనే దుప్పట్లో..

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అయితే, కొందరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొన్ని ఫీట్స్ చేస్తుంటారు.. ఇవి వైరల్ అయితే, రాత్రికి రాత్రే హైలెట్ కావొచ్చంటూ కలలుకంటుంటారు. ఈ ధ్యాసలో పడి కొందరు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. ఇలా కొంతమంది సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు.

Viral Video: ఛీ.. ఛీ.. రెచ్చిపోయిన జంట.. నడి రోడ్డుపైనే దుప్పట్లో..
Viral Video

Updated on: Jan 16, 2024 | 8:35 PM

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అయితే, కొందరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొన్ని ఫీట్స్ చేస్తుంటారు.. ఇవి వైరల్ అయితే, రాత్రికి రాత్రే హైలెట్ కావొచ్చంటూ కలలుకంటుంటారు. ఈ ధ్యాసలో పడి కొందరు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. ఇలా కొంతమంది సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో ఉన్నామన్న సంగతిని కూడా మర్చిపోయి.. మరీ దిగజారేలా ప్రవర్తిస్తున్నారు. అయితే, తాజాగా ఓ జంట.. నడిరోడ్డుపై చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేయడం వల్ల ప్రజలకు, ఇతర వాహనాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఇలాంటి కారణాలతోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా.. ముంబైలో వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనంపై ఓ జంట రొమాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. యువజంట బైక్ పై వెళుతున్న వీడియోను ఒకరు రికార్డ్ చేశారు. ఈ క్లిప్ బాంద్రా రిక్లమేషన్ ప్రాంతానికి చెందినది. దీనిని X లో బాంద్రా బజ్ షేర్ చేసారు. వీడియోలో యువతి, యువకుడు.. శాలువా ధరించి స్కూటర్‌పై ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని..రొమాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ వీడియో చివర్లో కెమెరాను చూసి నవ్వుతూ కనిపించారు. రద్దీగా ఉండే రోడ్డులో వారిద్దరూ హెల్మెట్ లేకుండా.. అలా రోడ్డుపై రోమాన్స్ చేసుకుంటూ దర్జాగా వెళుతుండటంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది వారి బాధ్యతారాహిత్యమైన అశ్లీల ప్రవర్తనపై మండిపడుతున్నారు. దీనిపై ముంబై పోలీస్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నెటిజన్లు.. రోడ్లపై ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి ఇలాంటి వాటి దృష్టి పెట్టాలంటూ నెటిజన్లు కోరుతున్నారు.

వీడియో చూడండి..

ఈ వీడియోపై పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇది డేరింగ్ కాదు, మూర్ఖత్వం అంటూ ఒక వినియోగదారు పేర్కొనగా.. ఇలాంటివి రోడ్లపై తగదంటూ మరొకరు పేర్కొన్నారు. అయితే, ముంబై జంట చేసిన వింత టూ వీలర్ స్టంట్ వైరల్ కావడంతో పోలీసులు చర్యలు సైతం తీసుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us