తల్లిపై కూతురి ప్రేమ ఎమోషనల్ వీడియో వైరల్‌.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న దీని ప్రత్యేకత ఏమిటంటే

|

Mar 30, 2024 | 8:34 AM

తల్లికి అండగా నిలవడం.. తల్లి  సంతోషంగా ఉండేలా ప్రయత్నించడం..  ఆమె బాధలో ఆమెకు మద్దతు ఇవ్వడం పిల్లల విధి. ప్రస్తుతం తల్లీ కూతుళ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి గురైనప్పుడు.. బాధితుల జుట్టు వేగంగా రాలిపోవడం గురించి తెలిసిందే.  అటువంటి పరిస్థితులలో క్యాన్సర్ బాధితులు తమ జుట్టును పూర్తిగా కత్తిరించుకుంటారు. ఈ వైరల్ వీడియోలో కూడా అలాంటి దృశ్యమే కనిపిస్తుంది.

తల్లిపై కూతురి ప్రేమ ఎమోషనల్ వీడియో వైరల్‌.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న దీని ప్రత్యేకత ఏమిటంటే
Daughter Love
Follow us on

సృష్టిలో తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తల్లికి తన పిల్లల కంటే ముఖ్యమైనది ఏమీ లేదు. తన పిల్లల సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. వారికి ఏదైనా ప్రమాదం జరిగినా తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడే ప్రయత్నం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఎల్లప్పుడూ తల్లికి అండగా నిలవడం.. తల్లి  సంతోషంగా ఉండేలా ప్రయత్నించడం..  ఆమె బాధలో ఆమెకు మద్దతు ఇవ్వడం పిల్లల విధి. ప్రస్తుతం తల్లీ కూతుళ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు.

క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి గురైనప్పుడు.. బాధితుల జుట్టు వేగంగా రాలిపోవడం గురించి తెలిసిందే.  అటువంటి పరిస్థితులలో క్యాన్సర్ బాధితులు తమ జుట్టును పూర్తిగా కత్తిరించుకుంటారు. ఈ వైరల్ వీడియోలో కూడా అలాంటి దృశ్యమే కనిపిస్తుంది. నిజానికి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ తల్లి జుట్టు కత్తిరించుకోవడానికి పార్లర్‌కి వెళ్లి కుర్చీలో కూర్చుంది. ఈ సమయంలో ఆమె తో పాటు కుమార్తె కూడా ఉంది. అయితే షేవింగ్ మిషన్ తీసుకుని తన తల్లి వెనుక నిలబడి తల్లికి బదులుగా తన జుట్టును తానే  కత్తిరించుకుంది. ఆ తర్వాత తల్లీ, కూతురు ఒకరినొకరు కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టారు. ఈ దృశ్యం చూపరులకు కన్నీళ్లు తెప్పించేలా ఉంది.

ఇవి కూడా చదవండి

 తల్లి కూతురు ప్రేమ

ఈ భావోద్వేగ వీడియో @PicturesFoIder అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. కేవలం ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోను ఇప్పటివరకు 4.6 మిలియన్లు అంటే 46 లక్షల సార్లు వీక్షించగా, 57 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత, ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ‘ఎంత అద్భుతమైన కుమార్తె. దీన్ని చూడటం చాలా గొప్పగా అనిపించింది’ అని మరొక వినియోగదారు ‘ఈ వీడియో నా కళ్లలో నీళ్లు తెప్పించింది’ అని రాశారు. అదేవిధంగా, ఒక వినియోగదారు ‘ఆమె బలమైన అమ్మాయి మరియు ఎల్లప్పుడూ తన తల్లిని ప్రేమిస్తుంది’ అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..