
Monster Lizard Video: ఈ మధ్యకాలంలో జంతువులు తరచూ జనావాస ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడప్పుడూ ప్రమాదకరమైన జంతువులు కూడా వస్తుండటంతో ప్రజలు ఒకింత భయాందోళనలకు గురవుతారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనాలతో రద్దీగా ఉన్న ఓ రెస్టారెంట్లోకి అకస్మాత్తుగా ఒక జెయింట్ బల్లి వచ్చింది. దాన్ని చూసి అక్కడున్న ప్రజలు షాక్ కాగా.. ఓ మహిళా వెయిటర్ మాత్రం ఎవ్వరూ ఊహించని పని చేసి షాక్ ఇచ్చింది.
మన చుట్టూ తరచుగా చిన్న బల్లులు కనిపిస్తాయి. అలాంటిది సడన్ గా ఓ పెద్ద బల్లి దర్శనమిస్తే.? దాన్ని చూసి ఎవరూ భయపడరు. ఇదే విధమైన వింత సంఘటన ఓ రెస్టారెంట్లో జరిగింది. ఒక పెద్ద మానిటర్ బల్లి అకస్మాత్తుగా ఓ రెస్టారెంట్లోకి దూరింది. బల్లి రాకతో అక్కడున్న కస్టమర్లు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఏం చేయాలో అర్థం కాక హాహా కారాలు చేశారు. ఇంతలో ఓ మహిళా వెయిటర్ మాత్రం ధైర్యంగా బల్లిని రెస్టారెంట్ నుండి బయటకు పంపించారు.
చూశారు..ఆమె ఆ రాకాసి బల్లిని ఎలా బయటకు లాగి పడేసిందో…బల్లి తోకను పట్టుకుని లాక్కుంటూ వెల్లి బయటపడేసింది. దీంతో అక్కడున్న వారంతా హామ్మాయా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియోను ‘ఫ్రెడ్ షుల్ట్జ్’ అనే వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేశారు. ‘బిల్లు చెల్లించకపోతే పరిస్థితి ఇది’ అంటూ ఫన్నీ క్యాప్షన్ యాడ్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 26 వేల మంది చూశారు. అదే సమయంలో, కొంతమంది సరదాగా కామెంట్స్ కూడా చేశారు. మరికొందరు ఆ మహిళా వెయిటర్ సాహసాన్ని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
Also Read: భారత్ కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు.! సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్ డైరెక్టర్