Viral Video: కోతుల మధ్యలో చిక్కుకున్న పీత.. ఆటాడేసుకున్న వానరాలు.. వైరల్ వీడియో.!

|

May 13, 2021 | 1:25 PM

Monkeys Crab Video: ఎక్కడో చెట్లమీద గెంతెలేస్తూ తిరిగే కోతులు..మరెక్కడో...నీటి అడుగున దాక్కునే పీతలు స్నేహాం చేయటం ఎక్కడైనా చూశారా..?.

Viral Video: కోతుల మధ్యలో చిక్కుకున్న పీత.. ఆటాడేసుకున్న వానరాలు.. వైరల్ వీడియో.!
Monkeys 2
Follow us on

Monkeys Crab Video: ఎక్కడో చెట్లమీద గెంతెలేస్తూ తిరిగే కోతులు..మరెక్కడో…నీటి అడుగున దాక్కునే పీతలు స్నేహాం చేయటం ఎక్కడైనా చూశారా..? ఈ వేర్వేరు జాతులు స్నేహితులు కాగలవా? ఎందుకు కాలేవు? ఎంచక్కా కావచ్చు..ఈ వీడియో చూస్తే మీకు అదే అనిపిస్తుంది. ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఓ పీత… కోతుల గుంపుకు చిక్కింది.

అంతే, అసలే.. కోతులు…ఆ పీతను చూసి ఊరుకుంటాయా…ఏం చేస్తున్నాయో చూస్తున్నారుగా, ఇదేదో తమకంటే వింతగా ఉందే..? ఇదేంటబ్బా..అని చాలా క్యూరియాసిటీతో చూస్తున్నాయి. దాని వెనకాలే నడుస్తూ వెళ్తున్నాయి. పిత కదలటం ఆపేస్తే..ఏమైంది..అన్నట్టుగా, అవి దాన్ని తట్టిలేపుతున్నాయి. హాల్లో ఫ్రెండ్‌ ఏమైంది..పద పోదాం అన్నట్లుగా ఒకదాని వెనుక ఒకటి పలకరిస్తున్నాయి. ఈ వానర చేష్టలు చూసిన స్థానికులు ఇదంతా తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్‌ చేయటంతో…అది కాస్త వైరల్‌గా మారింది.

ఎంతో అరుదుగా కనిపించే ఇలాంటి దృశ్యాలు..నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇలాంటి మరెన్నో క్యూట్ వీడియోస్ కోసం మా టీవీ9 డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి..మరిన్ని ఫన్నీ వీడియోస్‌ని ఎంజాయ్‌ చేయండి.

Also Read:

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

అద్భుతమైన స్కీం.. ప్రతీ నెలా రూ. 1500 జమ చేయండి.. రూ. 53 లక్షలు పొందండి.. వివరాలివే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!