Viral Video: ఏపీలో కొండముచ్చుల హల్‌చల్‌.. తాడేపల్లి రైల్వే గేట్ సెంటర్‌లో రచ్చ రచ్చ..

|

Oct 01, 2021 | 3:10 PM

Viral Video: సాధారణంగా కోతులు, కొండముచ్చులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్క చెట్టుపై నుంచి మరో చెట్టుకు.. అలాగే ఒక బిల్డింగ్ మీద నుంచి మరోదానిపైకి

Viral Video: ఏపీలో  కొండముచ్చుల హల్‌చల్‌.. తాడేపల్లి రైల్వే గేట్ సెంటర్‌లో రచ్చ రచ్చ..
Monkey
Follow us on

Viral Video: సాధారణంగా కోతులు, కొండముచ్చులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్క చెట్టుపై నుంచి మరో చెట్టుకు.. అలాగే ఒక బిల్డింగ్ మీద నుంచి మరోదానిపైకి ఎక్కుతూ.. దిగుతూ తెగ హల్చల్ చేస్తుంటాయి. అవి చేసే చర్యలు కొన్నిసార్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించినా.. వాటి చేష్టలు, చర్యలు చూడటానికి మాత్రం ఆహ్లాదకరంగా ఉంటాయి. తాజాగా తాడేపల్లి రైల్వే గేట్ సలాం సెంటర్‌లో కొన్ని కొండ ముచ్చులు హల్ చల్ చేశాయి.

సాధారణంగా కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఆలయాల దగ్గర, పంట పొలాల వద్ద చిరుతిళ్ల కోసం ఎగబడుతుంటాయి. అంతేకాదు కొన్ని గ్రామాల్లో గుంపులుగా తిరుగుతూ ఇళ్లలో చొరబడుతూ ఆగమాగం చేస్తుంటాయి. అప్పుడు వాటిని పారదోలడానికి కొండముచ్చును తీసుకువస్తారు. సహజంగా కొండముచ్చు అంటే కోతులకు భయం అని చెబుతారు. కానీ తాడేపల్లి రైల్వే గేట్ సలాం సెంటర్‌లో సీను రివర్స్ అయింది.

ఇక్కడ కొండముచ్చులు గుంపులుగా తిరుగుతూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇళ్ళలోకి చొరబడుతూ గందరగోళం సృష్టిస్తున్నాయి. జనాలపైకి ఎగబడుతున్నాయి. దీంతో దగ్గరికి వెళ్లేందుకు స్థానికులు ధైర్యం చేయలేకపోతున్నారు. వీటి భయంతో అందరు తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోతున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Telangana Assembly: పంచాయ‌తీరాజ్ కొత్త చ‌ట్టంతో గ్రామీణ వ్యవస్థ బలోతం.. శాసనసభలో సీఎం కేసీఆర్

Chiranjeevi: రాజమండ్రిలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి

Hyderabad: ఇద్దరు జూనియర్ ఆర్టిస్టుల ఆత్మహత్య.. అవకాశాల్లేక.. అనుకున్నది సాధించలేక..