Viral Video: ఈ వీడియో చూస్తే మీకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు పుడుతుంది..

కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను తీసుకెళ్లడం మీరు చూసి ఉంటారు. కొన్ని కోతులు మనషులపై దాడి చేయడం చూసి ఉంటారు. కానీ ఇది డిఫరెంట్. ట్రైన్ చేయకపోయినా.. అది ఎంచక్కా పిల్లాడి బంతి ఆడ ఆడుతుంది. ఈ దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: ఈ వీడియో చూస్తే మీకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు పుడుతుంది..
Monkey Kid Playing

Updated on: Sep 15, 2025 | 2:57 PM

పిల్లలు సాధారణంగా కోతులను చూసి భయపడి పారిపోతారు. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియో అందుు విభిన్నంగా ఉంది. ఆ వీడియోలో, పిల్లాడు కోతితో బంతాట ఆడుతున్నారు. అటు కోతి, ఇటు పిల్లాడి మధ్య స్నేహపూర్వక వాతావరణం కూడా చూడొచ్చు.

ఇన్ స్టాలో యూజర్ షేర్ చేసిన వీడియోలో ఒక ఇంటి బాల్కనీలో రెండు కోతులు కూర్చుని ఉండగా, ఒక పిల్లవాడు కింద నిలబడి ఉన్నాడు. ఆ కోతి చేతిలో ఒక బంతి ఉంది. అది దాన్ని కిందకు పడేసింది. ఆ పిల్లాడు బంతిని పట్టుకుని తిరిగి కోతివైపు విసిరేశాడు. ఇలా కొంత సమయం ఆట సాగించారు. ఆ వీడియోలో ఒక వృద్ధ మహిళ కూడా కనిపిస్తుంది. ఆమె కూడా వారి మధ్య ఆటలో ఓ సారి భాగమైంది. ఆపై నవ్వులు చిందిస్తూ అక్కడే నిలుచుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసిన యూజర్స్ చిరునవ్వులు కురిపిస్తున్నారు. వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి.. మిలియన్ల మంది చూశారు. 29 వేలకు పైగా వినియోగదారులు వీడియోను లైక్ చేశారు.

“ఆ పిల్లలను ఇంత బాగా పెంచి, అన్ని జీవులను ప్రేమించడం నేర్పిన వారి తల్లి పాదాలను తాకాలని నేను కోరుకుంటున్నాను” అని ఓ యూజర్ వ్యాఖ్యానించాడు. “ప్రకృతి ఇలా పనిచేస్తుంది” మరొకరు పేర్కొన్నారు.

వీడియో దిగువన చూడండి…