ఇనుప గొలుసులతో కొట్టుకున్న మంత్రి..వీడియో చూస్తే షాక్‌ అవుతారు..! ఎందుకో తెలిస్తే అవాక్కే!!

|

May 28, 2022 | 3:31 PM

అతనో రాష్ట్రానికి మంత్రి. కానీ, అతడు చేసిన పని మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మంత్రి స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఇలా చేయటం ఎంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇనుప గొలుసులతో కొట్టుకున్న మంత్రి..వీడియో చూస్తే షాక్‌ అవుతారు..! ఎందుకో తెలిస్తే అవాక్కే!!
Gujarat Minister
Follow us on

అతనో రాష్ట్రానికి మంత్రి. కానీ, అతడు చేసిన పని మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మంత్రి స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఇలా చేయటం ఎంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విపక్షాలు సైతం విరుచుకుపడుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా అతనిపై విమర్శనాస్త్రాలు సంధించాయి. ఇంతకీ సదరు మంత్రి గారు ఎవరో చెప్పనే లేదు కాదా..? గుజరాత్ మంత్రి అరవింద్ రయాని చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రాజ్ కోట్‌లో జరిగిన ఓ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి అరవింద్‌ రయానీ. పుజాది కార్యక్రమాల్లో భాగంగా రయానీ ఇనుప గొలుసులతో తన వీపుకేసి కొట్టుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మంత్రిగా ఉంటూ అశాస్త్రీయమైన చర్యలతో మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడం దురదృష్టకరమని ఆ పార్టీ గుజరాత్ అధికార ప్రతినిధి మనీష్ దోషి అభివర్ణించారు.

అయితే, మంత్రి చర్యను అధికార బీజేపీ సమర్ధించుకుంది. నమ్మకానికీ, మూఢనమ్మకానికీ మధ్య పలుచటి గీత మాత్రమే తేడా ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, గొలుసులతో కొట్టుకోవటం వెనుక అసలు విషయాన్ని వివరిస్తూ…నా చిన్న నాటి నుంచి ఆ దేవతకు భక్తుడినని అన్నారు.. మా స్వగ్రామంలో మా కుటుంబం కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంటుందని చెప్పారు. దీన్ని మూఢనమ్మకంగా పిలవొద్దన్నారు.. మా దేవతను ఆరాధించుకుంటున్నాం అంతే అని స్పష్టం చేశారు మంత్రి అరవింద్‌ రయానీ. కానీ, ప్రస్తుత కంప్యూటర్‌ యుగంలో మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చేయటంతో ఘటన గుజరాత్‌ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.