Watch Video: ప్రాణం మీదికి తెచ్చిన తింగరి వేషం.. అదృష్టం బాగుండి బచాయించాడు.. లేదంటే..

కొందరు అతి చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంటారు. సరదగా చేసే పనిలో ప్రాణం తీస్తుంటాయి. ఇలాంటి ఎన్నో ఘటనలకు సోషల్‌ మీడియా ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. అదృష్టం బాగుండడంతో ప్రాణాలతో బయట పడ్డాడు. వివరాల్లోకి వెళితే...

Watch Video: ప్రాణం మీదికి తెచ్చిన తింగరి వేషం.. అదృష్టం బాగుండి బచాయించాడు.. లేదంటే..
Viral Video

Updated on: Nov 06, 2022 | 11:41 AM

కొందరు అతి చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంటారు. సరదగా చేసే పనిలో ప్రాణం తీస్తుంటాయి. ఇలాంటి ఎన్నో ఘటనలకు సోషల్‌ మీడియా ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రతీ రోజూ వైరల్ వీడియోలు సందడి చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. అదృష్టం బాగుండడంతో ప్రాణాలతో బయట పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి మెట్లకు పక్కన ఉండే రేలింగ్ నుంచి జారాలాని డిసైడ్‌ అయ్యాడు. తన స్నేహితుడి వీడియో తీయమని తెలిపాడు.

అనుకున్నట్లే రేలింగ్‌పై కూర్చొని జారేందుకు సిద్ధమయ్యాడు. అయితే కొంత దూరం బాగానే వెళ్లాడు. కానీ ఒక్కసారిగా అదుపు తప్పింది. రేలింగ్‌ నుంచి జారుతూ ఓవైపు జారిపోయాడు. దీంతో అదుపు తప్పు రేలింగ్‌కు అవతలి వైపు పడిపోయాడు. వీడియో గమనిస్తే ఆ మెట్లు సెకండ్‌ ఫ్లోర్‌పైనే ఉన్నట్లు కనిస్తోంది. నిజానికి రేలింగ్‌పై అంత ఎత్తులో నుంచి పడిపోతే తీవ్రంగా గాయాలు కావాలి. కానీ ఎక్కడో అదృష్టం ఉండడంతో బతుకు జీవుడా అంటూ బచాయించాడు.

ఇవి కూడా చదవండి

రేలింగ్ నుంచి జారి లక్కీగా కింది ఫ్లోర్‌లోనే పడిపోయాడు. చిన్న గాయాలతోనే ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే ఆ వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని కొందరు, అతను చాలా అదృష్ట వంతుడు అంటూ మరికొందరు కామెంట్లు చేసుకున్నారు. ఇక ఇలాంటివి ట్రై చేయడం అంటే ప్రాణాలతో ఆడుకోవడమే అంటూ మరికొందరు స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us