Viral Video: పిచ్చెక్కిందంటారా భయ్యా! యాక్సిడెంట్ జరిగాక ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే కళ్లు చెదిరే..

కొంతమంది జనాలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. వాహనాలను అడ్డగోలుగా నడుపుతున్నారు...

Viral Video: పిచ్చెక్కిందంటారా భయ్యా! యాక్సిడెంట్ జరిగాక ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే కళ్లు చెదిరే..
Accident Viral Video

Updated on: Jun 25, 2022 | 12:15 PM

ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. కొంతమంది జనాలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. వాహనాలను అడ్డగోలుగా నడుపుతున్నారు. అలాగే మితిమీరిన వేగం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించకుంటే.. ఎప్పుడు.? ఎలా.? ప్రమాదం జరుగుతుందో చెప్పలేం.. తాజాగా ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యాక్సిడెంట్ అనంతరం పడిపోయిన వ్యక్తి ఏం చేశాడో చూస్తే ఫ్యూజులు ఎగరడం ఖాయం..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి వేగంగా బైక్‌పై వస్తుండగా.. అడ్డంగా వచ్చిన ఓ కారు అతడ్ని గట్టిగా ఢీకొట్టడం మీరు చూడవచ్చు. హెల్మెట్ ధరించాడు కాబట్టి.. ఆ వ్యక్తి తలకు ఎలాంటి గాయం కాలేదు గానీ.. ఇతర శరీర భాగాలకు మాత్రం గట్టిగానే తగిలి ఉండొచ్చు. అలాగే అతడి బైక్ కూడా ముక్కలు అయిపోయింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఒకటుంది. ఆ వ్యక్తి యాక్సిడెంట్ అనంతరం వింతగా కుంగ్-ఫూ స్టైల్‌లో గారడీ చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ షాకింగ్ వీడియోను ‘mas_adem’ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ 31 సెకన్ల వీడియోకు ఇప్పటివరకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా.. 60 వేల లైకులు వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘అతడు చనిపోయినట్లు ఉన్నాడు.. ఒక సమురాయ్ ఆత్మ అతడిలో ప్రవేశించినట్లు ఉంది’ అని ఒకరు కామెంట్ చేయగా.. మరొక నెటిజన్.. ‘తనకు తాను నయం చేసుకుంటున్నాడని’ రిప్లయ్ పెట్టాడు.