Viral Video: నోటికాడి జింకను లాక్కెళ్లిన వ్యక్తి.. ఆ చిరుతల కళ్లలో కసి మామూలుగా లేదు.. షాకింగ్ వీడియో మీకోసం..

|

Dec 30, 2021 | 9:35 PM

Viral Video: అడవిలో క్రూర మృగాలు ఏంటి అంటే టక్కున సింహం, పులి, చిరుత పులి అని చెబుతారు. వాటి వేట అంత భయంకరంగా ఉంటుంది మరి.

Viral Video: నోటికాడి జింకను లాక్కెళ్లిన వ్యక్తి.. ఆ చిరుతల కళ్లలో కసి మామూలుగా లేదు.. షాకింగ్ వీడియో మీకోసం..
Cheetah
Follow us on

Viral Video: అడవిలో క్రూర మృగాలు ఏంటి అంటే టక్కున సింహం, పులి, చిరుత పులి అని చెబుతారు. వాటి వేట అంత భయంకరంగా ఉంటుంది మరి. వాటికి ఆకలేస్తే.. అడవిలో దేనికో మూడినట్లే. మరి ఫుల్ ఆకలిగా ఉన్న చిరుత పులి ఓ జింకను వేటాడి తింటుంటే.. దాన్ని మరొకరు లాక్కెలితే ఎలాంటి ఉంటుంది? ఆ చిరుత కళ్లలో కసిని ఊహించగలరా? దాని రియాక్షన్‌ను తట్టుకోగలరా? ఇప్పుడు ఇలాంటి ఒల్లు గగుర్పొడిచే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే చిరుత ముందు నుంచి దాని ఆహారాన్ని లాక్కోవడానికి ఆ వ్యక్తికి అంత ధైర్యం ఎలా వచ్చిందిరా బాబూ అని షాక్ అవుతున్నారు నెటిజన్లు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. అడవిలో రెండు చిరుతలు జింకను వేటాడి తినే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంతలో ఓ వ్యక్తి ఆ చిరుత వద్దకు వచ్చి చనిపోయిన జింక కాళ్లను పట్టుకుని లాగుతాడు. చిరుతల ముందు నుంచి వాటిని లాక్కెళుతుంటే.. ఆ జింక కోపంతో రగిలిపోయాయి. వాటి కళ్లలో కసి మామూలుగా కనిపించలేదు. ఆగ్రహంతో గాండ్రించాయి. జింకను అతను లాక్కెళుతుంటే.. ఆగ్రహంతో అడుగులు ముందుకేస్తూ అతని వంక భీకరంగా చూడటం ఆ వీడియో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అతని గుండె ధైర్యం హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో చిరుతల కళ్లలోని కసిని చూసి హడలిపోతున్నారు. మరెందుకు ఆలస్యం ఆ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Uttarakhand Assembly Election 2022: ఆ చేతులే రాష్ట్రాన్ని లూటీ చేశాయి.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా ప్రధాని మోడీ విమర్శలు..

Diabetes Care: చలికాలంలో షుగర్ అదుపులో ఉండాలంటే.. ఈ పదార్థాలను తీసుకోండి..

Gold Price: వినియోగదారులకు కొత్త ఏడాదిలో బంగారం ధరలు షాకివ్వనున్నాయా..? కారణం ఏమిటి..?