Viral Video: డ్రగ్స్ ఉన్నాయంటూ యువతి పిలిచిన క్యాబిన్ క్రూ.. ఆ టైమ్‌లో బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన ట్విస్ట్ నెక్ట్స్ లెవల్..

|

Jun 30, 2022 | 9:22 PM

అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని అదేదో సినిమాలో డైలాగ్ ఉండేది. కానీ ఇప్పుడది నిజమే అంటున్నారు అబ్బాయిలు.

Viral Video: డ్రగ్స్ ఉన్నాయంటూ యువతి పిలిచిన క్యాబిన్ క్రూ.. ఆ టైమ్‌లో బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన ట్విస్ట్ నెక్ట్స్ లెవల్..
Viral News
Follow us on

వెయ్యి అబద్దాలు ఆడైన ఓ పెళ్లి చేయాలని పెద్దలు అంటుండేవారు.. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక అమ్మాయికి తమ ప్రేమను తెలిపేందుకు వెయ్యి దారులను వెతుకుంటున్నారు. సినిమాల ప్రభావం ఎంత ఉన్నప్పటికీ కొత్త కొత్త ఐడియాస్ తో ఎలాగైనా అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి నానాతంటాలు పడుతుంటారు. అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని అదేదో సినిమాలో డైలాగ్ ఉండేది. కానీ ఇప్పుడది నిజమే అంటున్నారు అబ్బాయిలు. ఏ అమ్మాయికి ఎలా ప్రమోజ్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియక సతమతమవుతుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే ఓ అబ్బాయికి ఎదురైంది. తన మనసులో ఉన్న అమ్మాయికి ప్రేమను తెలియజేసేందుకు సరికొత్త దారిని ఎంచుకున్నాడు.

తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేసేందుకు ఆ అబ్బాయి ఏకంగా ఫస్ట్ ఫ్లైట్‏లో సిబ్బంది సహాయం తీసుకున్నాడు. ముందు క్యాబిన్ సిబ్బంది ఆ అమ్మాయిని డ్రగ్స్ చెక్ చేయాలంటూ క్యాబిన్ కు పిలిచారు. దీంతో వెంటనే ఆ అమ్మాయి టెన్షన్ పడుతూ క్యాబిన్ క్రూ వద్దకు వచ్చింది. ఆ త్రవాత ఆమెను ఎడమ వైపు చూడమని సిబ్బంది చెప్పగా.. అటు వైపు చూసింది. అక్కడే పువ్వులు పట్టుకుని తన స్నేహితుడు నిల్చోవడంతో ఊపిరి పీల్చుకుంది. పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోగా.. ఆ అబ్బాయి మోకాళ్లపై కూర్చోని తన ప్రేమను వ్యక్తం చేశాడు. సముద్ర మట్టానికి 30,000 అడుగుల ఎత్తులో తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ఒక అమ్మాయి ఇంతకంటే ఎక్కువ ఏమి అడగగలదు ? ఆమె నిజంగా అదృష్టవంతురాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.