Viral Video: ఎన్ని.. ఎన్ని.. ఎన్ని దారుణాలు సార్.. ఎలా వస్తాయ్ మావ ఇట్టాంటి ఐడియాలు

మందేస్తే ఆరోగ్యం పాడు అవుద్ది.. కొబ్బరి నీళ్లు తాగితే హెల్త్‌కి ఎంతో మంచిది. ఆ లాజిక్ పట్టేశాడు ఈ బాబాయ్. రెండింటిని మిక్స్ కొట్టేశాడు. సో లెవల్ అయిపోతుంది. అదీ ఆయన లెక్క. అలాంటి ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ...

Viral Video: ఎన్ని.. ఎన్ని.. ఎన్ని దారుణాలు సార్.. ఎలా వస్తాయ్ మావ ఇట్టాంటి ఐడియాలు
Liquor With Coconut Water

Updated on: Nov 15, 2025 | 3:54 PM

మందు తాగిన తర్వాత కొందరు చేసే పనులు భలే నవ్వు తెప్పిస్తాయి. ఆ సమయంలో తమలో దాగి ఉన్న నిగూడమైన కళలను ప్రదర్శిస్తారు. కొందరు అయితే ప్యూర్ ఇంగ్లీషు మాట్లాడతారు. ఇంకొందరిలో సాయం చేసే గుణం పెరిగిపోతుంది. మరికొందరు దుస్తుల షాపు బయట ఏర్పాటు చేసిన అమ్మాయి బొమ్మలకు డ్రెస్సింగ్ సరి చేస్తూ.. తమలోని మహిళల పట్ల గౌరవాన్ని చాటుతారు. ఇంకొందరు బ్రిడ్జిలు, వంతెనలు ఎక్కి మెడిటేషన్ చేస్తారు. వేగంగా ప్రవహించే నీటి ప్రవాహాన్ని దాటేందుకు యత్నిస్తారు. ఇలా లోపలకి వెళ్లిన మెడిసిన్ వారితో చిత్ర విచిత్రమైన పనులు చేయిస్తుంది.

అయితే కొంతమంది అయితే మందు మిక్సింగ్‌లో సైతం తమ మార్క్ చూపిస్తారు. చిత్ర విచిత్రమైన కాంబినేషన్స్‌లో మందు మిక్స్ చేస్తారు. తాజాగా ఓ వ్యక్తి.. చీప్ లిక్కర్ ఒక పెగ్గు  పోసుకుని.. అందులోకి వాటర్ కాకుండా కొబ్బరి నీళ్లు మిక్స్ చేశాడు. మందు ఆరోగ్యానికి హాని చేస్తుందని తెలుసు. కొబ్బరినీళ్లు హెల్త్‌కి చాలామందికి మంచిది అంటారు. సో అతను ఆరోగ్యం పాడవ్వకుండా.. ఇటు కిక్ మిస్సవ్వకుండా ఆ రెండింటిని మిక్స్ చేశాడన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం, కిక్కుకి కిక్కు అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్ చేస్తున్నారు. ‘ఇలాంటి ఆలోచన మీకెందుకు రాలేదు అని సిగ్గు పడండి’ అంటూ ఓ నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించాడు.

అయితే ఒక చుక్క ఆల్కహాల్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. దాని జోలికి వెళ్లకండి.