Viral Video: మనోడికి ప్రాణాల మీద తీపి లేదేమో.. ఏకంగా136 కిలోల మొసలినే ఎత్తుకున్నాడు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

|

Apr 25, 2022 | 12:40 PM

సింహాన్ని అడవికి రాజు అని పిలిచినట్లే.. మొసలిని కూడా కింగ్‌ ఆఫ్‌ వాటర్‌ వరల్డ్‌ అని పిలుస్తారు. అదేవిధంగా నీటిలో ఉన్న మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉందని చెబుతారు.

Viral Video: మనోడికి ప్రాణాల మీద తీపి లేదేమో.. ఏకంగా136 కిలోల మొసలినే ఎత్తుకున్నాడు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Follow us on

సింహాన్ని అడవికి రాజు అని పిలిచినట్లే.. మొసలిని కూడా కింగ్‌ ఆఫ్‌ వాటర్‌ వరల్డ్‌ అని పిలుస్తారు. అదేవిధంగా నీటిలో ఉన్న మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉందని చెబుతారు. ఏవైనా జంతువులు ఈ క్రూర జంతువుకు చిక్కితే ఇక వాటి పని అయినట్లే. అందుకే సింహం, పులి, ఏనుగులాంటి జంతువులు కూడా మొసళ్లకు భయపడుతుంటాయి. ఈక్రమంలో మొసలికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరలవుతోంది. దానిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందులో ఒక వ్యక్తి ఒక పెద్ద మొసలితో ( Man Playing With Crocodile ) సరదాగా ఆడుకున్నాడు. ఏకంగా దానిని ఒళ్లో కూచోపెట్టుకుని ఫొటోలకు పోజులిచ్చాడు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కాగా ఈ మొసలి బరువు ఏకంగా 136 కిలోలట. ఇక ఈ వీడియోలోని వ్యక్తి పేరు క్రిస్టోఫర్‌ జిల్లెట్‌. ఇతను వన్యప్రాణి జీవశాస్త్రవేత్త. అదేవిధంగా జంతుప్రేమికుడు. ఇలా నిత్యం తన దగ్గరున్న మొసళ్లతో ఆడుకోవడం తన హాబీ అట. అంతేకాదు వాటితో సరదాగా గడిపిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి మురిసిపోతుంటాడు. ఇందులో భాగంగానే భారీ మొసలితో ఆటలాడుతూ ఆ వీడియోను నెట్టింట్లో పంచుకున్నాడు. ఈ వీడియోను చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘అతనికి ప్రాణాల మీద తీపి లేదేమో’,  ‘వామ్మో ఇదేం ఆటవిడుపురా బాబూ’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: UPI Payments: యూపీఐ సర్వర్లు డౌన్.. ఆగిన లావాదేవీలు.. ఇబ్బందులు పడ్డ వినియోగదారులు

Moong Dal Benefits: పెసర పప్పుతో బరువు ఈజీగా తగ్గొచ్చు.. ఇంకా బోలెడన్ని ప్రయోజనాలు

Aadhaar Card: ఆధార్‌ కార్డులో రకాలు .. ఒక్కో కార్డుకు ఒక్కో ఫీచర్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి