
లవర్స్ అన్నాక గొడవలు వస్తుంటాయి. కోపాలు తాపాలు కామన్. ఈ డిజిటల్ యుగంలో అప్పుడప్పుడు కాల్ ఎత్తకపోవడం, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకపోవడం వంటివి కూడా జరుగుతుంటాయి. మరీ గట్టిగా మాట్లాడితే.. వాట్సాప్‌లో బ్లాక్ కూడా చేసేస్తుంటారు అమ్మాయిలు. అప్పుడు అబ్బాయిలు.. వారిని బతిమిలాడుకోవడమో, వారి ఫ్రెండ్స్‌కు చెప్పి మాట్లాడమని చెప్పమని చెప్పడమో చేస్తుంటారు. కానీ, ఓ అబ్బాయి మాత్రం ఎవరు చేయని పని చేశాడు. ఏకంగా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లే కరెంట్ వైర్లు కాకుండా ఏకంగా ఆ అమ్మాయి ఊరికి వెళ్లే వైర్లను కట్ చేసి పడేశాడు. దాంతో ఆ గ్రామం మొత్తం చీకట్లో ఉండిపోవాల్సి వచ్చింది.
ఈ వింత సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక యువకుడు కరెంట్ పోల్ ఎక్కి.. పెద్ద కటింగ్ ప్లయర్‌తో వైర్లను కత్తిరించడం కనిపిస్తుంది. దీంతో ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. తన లవర్ ఫోన్ ఎత్తడం లేదని.. కరెంట్ లేకపోతే ఆమె టీవీ ఆఫ్ చేస్తుందని.. అప్పుడు తనతో మాట్లాడక తప్పదని ఆ యువకుడు ఆ పని చేసి ఉంటాడని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
‘Peak of unemployment’: Youth cuts off electricity to entire village over partner’s busy phone pic.twitter.com/PKbZtQ9mn9
— The Tatva (@thetatvaindia) September 2, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి