Man Funny Video Viral: మీరు చిన్నప్పుడు దొంగ-పోలీస్ ఆట ఎప్పుడైనా ఆడారా? అయితే, మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఇందులో నిజంగానే పోలీసులు ఆ ఆట ఆడారేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. ఓ దొంగ తప్పించుకుని పారిపోతూ ఎక్కడ దాక్కోవాలో తెలియక.. ఓ పెద్ద చెట్టెక్కి కూర్చున్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూస్తున్నారుగా…
खुदी को कर के बुलंद इतना चढ़ गए ऊपर जैसे तैसे,
पर #Khakhi वाले उतार देंगे, बड़े आराम से ?? pic.twitter.com/FoePjKOLfj— Dipanshu Kabra (@ipskabra) May 12, 2021
వెంటపడ్డ పోలీసులకు ఈ దొంగ చూపించాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఏకంగా చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టు కింద చుట్టుముట్టిన పోలీసులు..దొంగను కిందకు దిగాలని పలుమారు కోరారు. అయిన అతడు కిందకు దిగి రాకపోవటంతో…ఇక లాభం అనుకున్నారు పోలీసులు. ఏకంగా ఓ పోలీస్ ఆఫీసరే రంగంలోకి దిగి…బూట్లు విప్పేసి చెట్టెక్కేశారు. తప్పించుకునే దారిలేదని తెలిసి కూడా ఆ దొంగ..చెట్టుమీదనే మరింత పైకి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ, ఎట్టకేలకు పోలీసులకు చిక్కక తప్పలేదు.
ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా, నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. దొంగోడి అతి తెలివికి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. చెట్టెక్కి తప్పించుకోవటం ఏంట్రా బాబు అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..
వాట్సాప్లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!
అద్భుతమైన స్కీం.. ప్రతీ నెలా రూ. 1500 జమ చేయండి.. రూ. 53 లక్షలు పొందండి.. వివరాలివే.!
డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!