Viral: చేపల గాలానికి చిక్కిన నల్లటి ఆకారం.. దాన్ని చూడగా ఫ్యూజులౌట్.!

|

Apr 01, 2024 | 1:47 PM

ఇంటర్నెట్‌లో ప్రతీ రోజూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. వీటిల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని షాక్‌కు గురి చేస్తాయి. ఇంకొన్ని భయభ్రాంతులు తెప్పిస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన తర్వాత నెటిజన్లు అయ్యబాబోయ్.! ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.?

Viral: చేపల గాలానికి చిక్కిన నల్లటి ఆకారం.. దాన్ని చూడగా ఫ్యూజులౌట్.!
Viral Video
Follow us on

ఇంటర్నెట్‌లో ప్రతీ రోజూ ఎన్నో రకాల వైరల్ వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. వీటిల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని షాక్‌కు గురి చేస్తాయి. ఇంకొన్ని భయభ్రాంతులు తెప్పిస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన తర్వాత నెటిజన్లు అయ్యబాబోయ్.! తృటిలో ప్రమాదం తప్పిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి అదేంటో చూసేద్దామా.. వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తనకు దగ్గరలోని సరస్సులో చేపల వేటకు వెళ్తాడు. పడవలో కూర్చుని గాలానికి హుక్ పెట్టి.. నీటిలో వేస్తాడు. అలా కాసేపు నిరీక్షించిన అనంతరం.. ఆ గాలం కాస్తా బరువెక్కుతుంది. అబ్బో.! పెద్ద చేప పడినట్టు ఉందేమోనని సంతోషపడ్డాడు. ఒడిసిపట్టుకుని మరీ.. ఆ గాలాన్ని పైకి లాగాడు. కట్ చేస్తే.. అతడికి షాక్ ఇస్తూ.. ఓ భారీ మొసలి బయటకొచ్చింది. కాసేపటికే అది నీటిలోకి వెళ్లిపోయింది. కానీ ఈ ఊహించని పరిణామానికి సదరు వ్యక్తి మైండ్ బ్లాంక్ అయింది. కాగా, ఈ వీడియోను ‘అమేజింగ్ నేచర్’ అనే ట్విట్టర్ ఖాతా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దాన్ని చూసి నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

వైరల్ వీడియో..