వార్నీ..ఇదేం కక్కుర్తి బుద్ధి..! రూ. 10 లక్షల కారులో వచ్చి.. రూ. 10 వేల మేకను ఎకెసుకెళ్లిన కేటుగాళ్లు!

చోరీలకు పాల్పడే దొంగలు సాధారణంగా ఎవరికంటా పడకుండా రహస్యంగా, రాత్రి సమయాల్లో ఇళ్లను టార్గెట్ చేస్తుంటారు. కానీ, కాలం మారుతున్న కొద్దీ దొంగల స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది. తాజాగా బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో వెలుగు చూసిన ఒక విచిత్రమైన ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. సుమారు పది లక్షల విలువ చేసే ఖరీదైన లగ్జరీ కారులో వచ్చిన దుండగులు, కేవలం పది వేల రూపాయల విలువ చేసే మేకలను దొంగిలించి పరారయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

వార్నీ..ఇదేం కక్కుర్తి బుద్ధి..! రూ. 10 లక్షల కారులో వచ్చి.. రూ. 10 వేల మేకను ఎకెసుకెళ్లిన కేటుగాళ్లు!
Purnia Goat Theft

Updated on: Oct 22, 2026 | 2:25 PM

బీహార్‌లోని పూర్ణియాలో జరిగిన విచిత్రమైన చోరీ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పది లక్షల రూపాయల ఖరీదైన లగ్జరీ కారులో వచ్చిన దుండగులు, కేవలం పది వేల విలువ చేసే మేకలను దొంగిలించి పరారయ్యారు. స్థానికులు అప్రమత్తమయ్యే లోపే వారు అక్కడ నుంచి పరారయ్యారు. ఈ మొత్తం తంతు సమీపంలోని సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయింది. ఖరీదైన కార్లలో వచ్చి ఇలా చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అసలు ఏం జరిగింది?

పూర్ణియా ప్రాంతంలో కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన మేకలను మేపుతున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఒక తెల్లటి రంగు లగ్జరీ కారు రోడ్డు పక్కన ఆగిపోతుంది. ఆ కారు నుండి దిగిన ఇద్దరు యువకులు ఎంతో పక్కా ప్లాన్‌తో చుట్టుపక్కల ఎవరూ గమనించకుండా రోడ్డు పక్కన ఉన్న మేకల వద్దకు వెళ్లారు. క్షణాల వ్యవధిలో అత్యంత చాకచక్యంగా ఆ మేకలను ఎత్తుకెళ్లి కారు డిక్కీలో లేదా వెనుక సీట్లో పడేశారు.

వారు మేకలను కారులోకి ఎక్కించుకునే లోపు స్థానికులు కొందరు గమనించి కేకలు వేశారు. అయితే వారు తేరుకునేసరికి దుండగులు కారును వేగంగా పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. దొంగల వేగవంతమైన చర్యను చూసి స్థానికులు అవాక్కయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ వింతైన చోరీ ఘటనకు సంబంధించిన పూర్తి దృశ్యాలు ఆ ప్రాంతంలోని ఒక సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. అక్టోబర్ 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతటి ఖరీదైన కారులో తిరిగే ధనవంతులు లేదా పెద్ద మనుషులుగా కనిపించేవారు ఇలాంటి చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడటం పట్ల స్థానికులు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

గతంలో కూడా బక్రీద్ పండుగ సమయంలోనూ ఇదే తరహాలో కార్లలో వచ్చి మేకలను ఎత్తుకెళ్లిన ఘటనలు వెలుగుచూశాయి. పూర్ణియా, పరిసర ప్రాంతాలలో పశువుల పెంపకం ఎక్కువగా ఉంటుంది. ఇలా లగ్జరీ కార్లను ఉపయోగించి పశువులను, మేకలను అపహరిస్తుండటంతో స్థానిక పశుపోషకులు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి కేటుగాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us