Viral Video: దేవుడే దిగివచ్చి పసిపాపకు ప్రాణం పోశాడా? సెకన్లలో మిరాకిల్ చేసి చూపిన డాక్టరమ్మ.. షాకింగ్ వీడియో..

Viral Video: ‘వైద్యో నారాయణో హరిః’ అంటారు. వైద్యులు ఆ భగవంతుడిని సమానం అని అర్థం. ఎందుకంటే ప్రాణాలను పోసే శక్తి, హరించే శక్తి ఆ దేవుడి..

Viral Video: దేవుడే దిగివచ్చి పసిపాపకు ప్రాణం పోశాడా? సెకన్లలో మిరాకిల్ చేసి చూపిన డాక్టరమ్మ.. షాకింగ్ వీడియో..
Goddess Doctor

Updated on: Sep 22, 2022 | 12:22 PM

Viral Video: ‘వైద్యో నారాయణో హరిః’ అంటారు. వైద్యులు ఆ భగవంతుడిని సమానం అని అర్థం. ఎందుకంటే ప్రాణాలను పోసే శక్తి, హరించే శక్తి ఆ దేవుడి తరువాత వైద్యులకు మాత్రమే ఉంది కాబట్టి. ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడితే.. ఆ వైద్యులను బాధిత వ్యక్తులు దేవుడికంటే ఎక్కువగా కొలుస్తారు. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఊపిరి ఆడకుండా పుట్టిన పసిపాపకు ఓ వైద్యురాలి తన ఊపిరి ఊది ప్రాణం పోసింది. ఆ చిన్నారి గొంతు నుంచి కేరింతలు వచ్చేలా చేసింది.

అవును, ఓ గర్భిణీ ప్రసవం చేసి బిడ్డకు బయటకు తీశారు వైద్యులు. అయితే, ఆ చిన్నారి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇంతలో ఆ చిన్నారి ఉలుకుపలుకు లేకుండా మిన్నకుండిపోయింది. ఊపిరి కూడా తీసుకోవడంతో లేదు. దాంతో అలర్ట్ అయిన ఓ వైద్యురాలు.. వెంటనే చిన్నారిని సీపీఆర్ చేసింది. పసిపాప నోటి ద్వారా గాలి ఊది ఊపిరి అందించారు. వెనక్కి తిప్ప వీపుపై కొడుతూ గుండె కొట్టుకునేలా చేశారు. చివరకు వైద్యురాలి ప్రయత్నాలు ఫలించాయి. చిన్నారి ఊపిరి తీసుకుంది. గుండె కొట్టుకుంది. కేరుమంటూ సందడి చేసింది. మొత్తానికి చిన్నారి ప్రాణాలు నిలవడంతో.. ప్రాణం పోసిన వైద్యురాలు సహా అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. పసిపాప ప్రాణాలు కాపాడిన వైద్యురాలికి ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

చిన్నారికి వైద్యురాలు ప్రాణం పోసిన తీరుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వైద్యురాలిని ప్రాణం పోసిన దేవతగా పోలుస్తూ కీర్తిస్తున్నారు. ‘వైద్యో నారాయణో హరిః’ అన్న దానికి నిదర్శనంగా నిలిచారని కొనియాడుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ బ్యూటీపుల్ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us