Viral Video: కిచెన్‌లో వింత శబ్దాలు.. వెళ్లి చూడగా ఒక్కసారిగా భయంతో గుండె గుభేల్!

ఇంట్లో అందరూ కూడా హాల్‌లో సేద తీరుతున్నారు. సరిగ్గా అదే సమయంలో కిచెన్‌లో నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి...

Viral Video: కిచెన్‌లో వింత శబ్దాలు.. వెళ్లి చూడగా ఒక్కసారిగా భయంతో గుండె గుభేల్!
Snake

Updated on: May 02, 2022 | 8:43 PM

ఇంట్లో అందరూ కూడా హాల్‌లో సేద తీరుతున్నారు. సరిగ్గా అదే సమయంలో కిచెన్‌లో నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. ముందుగా వాటి గురించి కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. కానీ అవి క్రమేపీ పెద్దగా వస్తుండటంతో ఏమై ఉంటుందని చెక్ చేయగా ఒక్కసారిగా వారి గుండె గుభేల్ అయింది. నాగుపాము ఎంచక్కా కిచెన్‌లో దాక్కుని ఉండటాన్ని చూసి కుటుంబసభ్యులందరూ భయపడిపోయారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న వైల్డ్ లైఫ్ సొసైటీ ఎన్‌జీఓకు చెప్పగా.. వారు అక్కడికి చేరుకొని పామును పట్టేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇక కిచెన్‌లోని గ్యాస్ స్టవ్ కింద నాగుపాము ఉన్నట్లు గుర్తించిన ఆ ఎన్‌జీఓ సిబ్బంది.. చాకచక్యంగా దాన్ని పట్టుకుని బంధించారు. ఆ తర్వాత సురక్షితంగా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. కాగా, ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పాత వీడియో అయినప్పటికీ.. ఇంటర్నెట్‌లో మరోసారి ట్రెండింగ్ అవుతోంది.

Also Read:

Loading...
Unable to load recommendations.
Follow Us