Kids jump Viral Video: పిల్లలు భగవంతుని స్వరూపం.. వారికి మనం ఎం చెబితే అది నేర్చుకుంటారు. వారి అమాయకత్వం, ఆప్యాయత మనందరినీ కట్టిపడేస్తుంటుంది. అందుకే చాలామంది పిల్లలను అల్లారుముద్దుగా పెంచుతారు. వారి అల్లరిని తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో వారిపై ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకోవాలని చాలామంది ప్రత్యేకంగా పేర్కొంటుంటారు. మనం వారిపై దృష్టిపెట్టకపోతే ప్రమాదంలో పడతారనడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఎందుకంటే.. ఇద్దరు పిల్లలు 22 అంతస్తుల భవనంపైనా ఏం చేశారో చూస్తే.. మీకు కూడా కోపం వస్తుంది. ఈ వీడియో చూసినవారంతా పిల్లలను.. వారి తల్లిదండ్రులు అలా ఎలా వదిలిపెడతారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పిల్లలు అలా భవనంపైన ప్రమాదకర రీతిలో నిలబడిన దృశ్యాలు, వారు రూఫ్ పై చేసిన విన్యాసాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ వీడియో చైనాలోని హుబీ ప్రాంతంలో ఉన్న జియానింగ్ కు చెందినది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఇద్దరు చిన్నారులు.. 22 అంతస్తుల భవనం పైకప్పుపైకి ఎక్కి ఎలా దూకుతున్నారో వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో పిల్లలిద్దరూ నిర్భయంగా కనిపిస్తూ ఒక కప్పుపై నుంచి.. మరో పైకప్పు పైకి దూకుతుంటారు. అయితే.. పిల్లలిద్దరూ క్షేమంగా ఉంటారు. వారికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వైరల్‌గా మారిన ఈ వీడియోను సమీపంలోని ఓ వ్యక్తి రికార్డు చేశాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
దీనిని చూసిన నెటిజన్లంతా భయంతో పలు కామెంట్లు చేస్తున్నారు. పిల్లలను ఇలా వదిలేయకండి అంటూ పలు సూచనలు చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎప్పుడూ కన్నేసి ఉంచాలని.. సూచిస్తున్నారు. వీడియోలో పిల్లలిద్దరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నారులకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫామ్‌లలో షేర్ అవుతోంది. ఈ వీడియోను స్పుత్నిక్ అనే పేజీ యూట్యూబ్‌లో షేర్ చేసింది.
వీడియో..
Also Read: