Viral Video: నిద్రపోతున్న పెంపుడు శునకంపై చిరుత దాడి.. చనిపోయినట్లు నటించిన కుక్క.. ఆ తర్వాత

|

Aug 14, 2022 | 6:16 PM

సమయస్పూర్తి అనేది చాలా ఇంపార్టెంట్. సమయానికి అనుగుణంగా వ్యవహరిస్తే పెద్ద.. పెద్ద సమస్యల నుంచి బయటపడవచ్చు. కొన్నిసార్లు ప్రాణాలు సైతం నిలుపుకోవచ్చు.

Viral Video: నిద్రపోతున్న పెంపుడు శునకంపై చిరుత దాడి.. చనిపోయినట్లు నటించిన కుక్క.. ఆ తర్వాత
Leopard Attacks Dog
Follow us on

Trending Video: శునకాలు విశ్వాసం చూపించడంలో నంబర్ వన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి చూపించే ప్రేమ, యజమాని పట్ల ఉండే భక్తిభావం ఇప్పుడు కొందరు మనుషుల వద్ద కూడా దొరకడం లేదనడం అతిశయోక్తి కాదు. ఇక రాత్రి సమయాల్లో ఇంటికి గస్తీ కాయాలంటే శునకాల తర్వాతే.  కొన్నిసార్లు అవి యజామానికి, ఇంటికి సెక్యూరిటీగా ఉంటూ ప్రాణాలు వదిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కుక్కలు తెలివి తేటల విషయంలో  కూడా తక్కువ కాదు అని ఈ ఘటన నిరూపిస్తుంది. తాజాగా యజమాని ఇంటి బయట నిద్రిస్తున్న ఓ పెంపుడు శునకంపై చిరుతలో ఒక్కసారిగా దాడి చేసింది. నిద్రిస్తున్న సమయంలో అలజడి లేకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన చిరుత ఒక్కసారిగా వెళ్లి గొంతు పట్టింది. దాని బారి నుంచి తప్పించుకునేందుకు కుక్క విశ్వప్రయత్నం చేసింది. కానీ చిరుతకు చిక్కాక తప్పించుకోవడం అసాధ్యం కదా.. కనీసం పారిపోయే ప్రయత్నం చేద్దామన్న కూడా ఆ ఇంటి యజామని దాన్ని చైన్‌తో కట్టేశారు. దీంతో ఆ సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించింది శునకం. చనిపోయినట్లు యాక్ట్ చేసింది. ఈ క్రమంలో చిరుత కాసేపు అయోమయానికి గురైంది. ఇంతలోనే ఓనర్ బయటకు వచ్చే క్రమంలో అలజడి అవ్వడంతో.. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యింది చిరుత. దీంతో ఆ పెట్ డాగ్ స్వల్ప గాయాలతో బయటపడింది. కర్ణాటక(Karnataka) ఉడుపి(Udupi)లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..