
అడవిలో ఒక జీవికి ఆకలి వేసిందంటే.. మరో జీవికి ఆయువు మూడినట్లే కదా..!. ప్రపంచంలో అనేక రకాల పాములు ఇతర పాములను చంపి తింటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన రెండు పాములు ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. ఒక వైపు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముగా చెప్పబడే ఇన్లాండ్ తైపాన్, మరొక వైపు ఆస్ట్రేలియాలో అత్యంత ప్రమాదకరమైన పాముగా పరిగణించబడే కింగ్ బ్రౌన్ స్నేక్ ఉన్నాయి.
ఈ పాము పోరాటం సినిమా సన్నివేశానికి ఏమాత్రం తీసిపోదు. వీడియోలో కింగ్ బ్రౌన్ స్నేక్ నెమ్మదిగా ఇన్లాండ్ తైపాన్ వైపుకు చేరుకోవడాన్ని మీరు చూడవచ్చు. కింగ్ బ్రౌన్ దగ్గరకు రావడాన్ని చూసి, ఇన్లాండ్ తైపాన్ కోపంగా దానిపై దాడికి దిగింది. ఇన్లాండ్ తైపాన్ ఒక్క కాటుతో 100 మందిని చంపగలదని చెబుతారు, కానీ దాని విషం కింగ్ బ్రౌన్ దాని విషం పని చేయలేదని వీడియో ద్వారా అర్థమవుతుంది. కింగ్ బ్రౌన్ స్నేక్.. ఇన్లాండ్ తైపాన్ పాముకు ఒక్క ఉదుటన పట్టి.. కరకరా నమిలి మింగేసింది.
The Inland Taipan, the world’s most venomous snake, with enough venom in a single bite to kiII 100 adult humans, is utterly powerless against the King Brown.
Fun fact: if you ever see ‘king’ in the name of snake species it (generally) means it eats other snakes! pic.twitter.com/rOejpIUlSh
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) October 8, 2025
వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @AMAZlNGNATURE అనే IDతో షేర్ చేశారు. “ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాము ఇన్‌ల్యాండ్ తైపాన్. ఇది ఒకే కాటుతో 100 మంది మనుషఉలకు చంపేంత విషాన్ని కలిగి ఉంది. అలా పాము కూడా.. కింగ్ బ్రౌన్ ఎదర్కోలేక శక్తిహీనంగా మిగిలపోయింది. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే.. మీరు ఎప్పుడైనా పాము ముందు కింగ్ అనే పేరు ఉన్నట్లయితే.. దాని అర్థం అది ఇతర పాములను తింటుంది!” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ 54 సెకన్ల వీడియోకు ఓ రేంజ్‌లో లైక్స్, కామెంట్స్, షేర్స్ వస్తున్నాయి.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..