90వ దశకం వరకూ యువతీ యువకులకు ఆటలు అంటే గిల్లి దండాలు, కబడీ, గోళీలు , బిళ్ళంగోడు వంటివి. వీటిల్లో ఏదొక ఆట తప్పనిసరిగా 90 వ దశకంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ తెలిసి ఉంటుంది. కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా పిల్లల ఆడుకునే ఆటల్లో కూడా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకునే ఆటల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. శారీరక శ్రమకు బదులు ‘PUBG’, ‘టెంపుల్ రన్’, ‘క్యాండీ క్రష్’ వంటి గేమ్స్ చిన్నారులను ఆకట్టుకుని పాపులర్ అయ్యాయి. అటువంటి పరిస్థితిలో.. రీల్ వరల్డ్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది యువకులు ‘కోకనట్ బ్రేక్‘ గేమ్ ఆడుతుండగా.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. వాస్తవానికి ఈ గేమ్‌ను ఆడే విధానం చాలా ప్రమాదకరం. అంటే గురి తప్పితే మనిషి చేయి విరిగిపోయే ప్రమాదం ఉంది. అలా అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
వైరల్ అయిన ఈ వీడియోలో ఒక యువకుడు తన అరచేతిలో కొబ్బరికాయను పెట్టుకుంటే.. ఆ కొబ్బరికాయను మరొకరు కొబ్బరికాయతో పగులగొడుతున్నారు. ఇలా కొంతమంది యువకులు బృందంగా ఏర్పడి మరీ వంతులవారీగా కొబ్బరి కాయలను పగలగొడుతున్నారు.
వాస్తవానికి ఈ గేమ్ లో ఒక యువకుడు తన అరచేతిలో కొబ్బరికాయను పట్టుకుని ఉంటే మరొక యువకుడు కొబ్బరికాయను పట్టుకుని అవతలి యువకుడి చేతిలోని కొబ్బరి కాయను గట్టిగా కొట్టాడు. తద్వారా అరచేతిలోని కొబ్బరికాయ పగిలిపోయింది . ఎవరు అరచేతిలోని కొబ్బరికాయ ఒక్క దెబ్బకు పగలకొడితే ఆ యువకుడు విజేత అవుతాడు. అయితే ఈ గేమ్ ప్రమాదకరమే. ఎందుకంటే కొబ్బరికాయతో కొబ్బరికాయ కొట్టే సమయంలో ఏ మాత్రం గురి తప్పినా కొబ్బరి కాయ పట్టుకున్న యువకుడి చేతికి తగులుతుంది. అప్పుడు ఆ ఫలితం ఎలా ఉంటుందంటే .. చేయి విరిగే ప్రమాదం కూడా ఉంటుంది.
ఈ ప్రత్యేకమైన గేమ్ వీడియో ఆగస్టు 31న Instagram పేజీ @ttl.india లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ గేమ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ రీల్‌ను షేర్ చేస్తూ కొబ్బరికాయను కొబ్బరి కాయతో పగలగొట్టే పోటీ.. అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 40 వేలకు పైగా వ్యూస్ రాగా.. వెయ్యికి పైగా లైక్‌లు వచ్చాయి. అలాగే పలువురు రకరకాల కామెంట్ చేశారు. పోటీలో మీ తలపై పెట్టుకుని అప్పుడు గేమ్ ఆడండి.. అప్పుడు మీరు నిజమైన వినోదాన్ని ఆనందిస్తారని వ్యంగ్యంగా కామెంట్ చేయగా.. రెండవ వ్యక్తి ప్రతి మహారాష్ట్రీయుడికి ఈ గేమ్ గురించి తెలుసని కామెంట్ చేశారు. కొందరు చేయి విరిగితే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..