Indian Railways: దేశంలోనే ఇది ప్రత్యేక రైల్వే స్టేషన్.. సగం రైలు మధ్యప్రదేశ్‌లో, మరో సగం రైలు రాజస్థాన్‌లో..

|

Oct 19, 2021 | 6:19 AM

Indian Railways: దేశ వ్యాప్తంగా కొన్ని వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని రైల్వే స్టేషన్లు మాత్రం వాటి భౌగోళిక స్థానం కారణంగా చర్చనీయాంశంగా మారాయి.

Indian Railways: దేశంలోనే ఇది ప్రత్యేక రైల్వే స్టేషన్.. సగం రైలు మధ్యప్రదేశ్‌లో, మరో సగం రైలు రాజస్థాన్‌లో..
Railway Station
Follow us on

Indian Railways: దేశ వ్యాప్తంగా కొన్ని వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని రైల్వే స్టేషన్లు మాత్రం వాటి భౌగోళిక స్థానం కారణంగా చర్చనీయాంశంగా మారాయి. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా.. వాటికి సంబంధించిన కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇలాంటి ఆసక్తికర స్టేషన్ల గురించి చాలా తక్కువ మందికి తెలిసుంటుంది. అలాంటి స్టేషన్లలో ఒకటి మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దులో ఉన్న భవానీ మండి రైల్వే స్టేషన్. భారతదేశంలోనే ఎంతో ప్రత్యేకమైన ఈ రైల్వే స్టేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్టేషన్‌లో నిలిచే రైలు.. సగం రాజస్థాన్‌లో ఆగితే.. మిగిలిన సగం మధ్యప్రదేశ్‌లో ఆగుతుంది. ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ, ఇదే నిజం. రాజస్థాన్‌లోనే అలాంటి రైల్వే స్టేషన్ ఉంది.

భవాని మండి రైల్వే స్టేషన్.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. ఆ కారణంగా దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్టేషన్‌కు ఒక రైలు వచ్చిందంటే.. ఇక్కడ రైలు ఇంజిన్ ఒక రాష్ట్రంలో పార్క్ చేయబడితే.. రైలు బోగీలు మరొక రాష్ట్రంలో నిలిచి ఉంటాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రయాణికులు ఇక్కడ టికెట్ తీసుకోవాలంటే రాజస్థాన్‌లో నిలిబడితే.. టిక్కెట్ ఇచ్చే క్లర్క్ మాత్రం మధ్యప్రదేశ్‌లో కూర్చుంటాడు. ఇలా అనేక ప్రత్యేకతలు ఉన్న నేపథ్యంలోనే ఈ రైల్వే స్టేషన్ పేరుతో ఒక సినిమా కూడా రూపొందించారు. 2018లో బాలీవుడ్ కామెడీ ఫిల్మ్ ‘భవానీ మంది తేసన్’ ద్వారా ఈ నగరానికి సంబంధించి విభిన్న కథను ప్రజలకు తెలియజేశారు. ఈ సినిమాకు సయీద్ ఫైజాన్ హుస్సేన్ దర్శకత్వం వహించారు.

ఇదిలాఉంటే.. భవానీ మండి పట్టణానికి మరో కోణం కూడా ఉంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఈ ప్రాంతం పెద్ద కేంద్రంగా మారింది. స్మగ్లర్లు ఈ ప్రాంతాన్ని తమ అక్రమ రవాణాకు యూజ్ చేసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతం కావడంతో స్మగ్లర్లు దీనిని తమదైన శైలిలో వినియోగించుకుంటూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. అందుకే, కొన్నిసార్లు సరిహద్దుకు సంబంధించి రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం తలెత్తుతుంది.

Also read:

Viral News: అమ్మ బాబోయ్.. ఇలాంటి ఓనర్స్ కూడా ఉంటారా?.. స్నానం కూడా చేయొద్దంటే ఎలా బాసూ..!

Viral Video: పాపం పోరడు.. కోతి చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు.. ఈ వీడియో చూస్తే గంటసేపు నవ్వు ఆగదంతే..

Zodiac Signs: ఈ మూడు రాశుల వారు ఎప్పుడూ గట్టి పోటీ ఇస్తారు.. ఏ ఏ రాశుల వారంటే..