
మానవ జీవితంలో ప్రేమ చాలా ముఖ్యమైన విషయం. ప్రేమ లేకుండా ఏ మానవుడూ ఉండలేడు. అందరు మనుషులు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ప్రేమలో పడతారు. కానీ, భారతదేశానికి సంబంధించినంతవరకు ప్రేమ వివాహాలను కుటుంబాలలో స్వాగతించరు. భారతీయ తల్లిదండ్రులు తమ పిల్లలు ఒకే మతం, కులం, సమాజంలో వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ ప్రేమ వీటన్నింటినీ అధిగమిస్తుంది. ప్రేమను ఏ ఆంక్షలు ఆపలేవు. ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించే తల్లిదండ్రుల మధ్య ఒక కుటుంబం తమ కొడుకు తీసుకువచ్చిన అమెరికన్ స్నేహితురాలిని స్వాగతించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
చాలా మంది ఇళ్లలో పిల్లలు తల్లిదండ్రులతో అంత ఓపెన్ గా ఉండలేరు. స్నేహితులు, లేదంటే, ప్రియుడు, ప్రియురాలిని ఇంట్లో వాళ్లకి పరిచయం చేయలేరు. వారిని పరిచయం చేయడం కాదు.. మనం ఒక సంబంధంలో ఉన్నామని వారికి తెలిస్తే ఏ పేరెంట్స్ అంగీకరించరు. కానీ, జమ్మూలో ఒక భారతీయ తల్లిదండ్రులు తమ కొడుకు వెంట తీసుకు వచ్చిన అమెరికన్ స్నేహితురాలిని ఎంతో ప్రేమతో, ఆనందంతో స్వాగతించిన అద్భుతమైన, హృదయాన్ని హత్తుకునే ఘటన కెమెరాలో బంధించబడింది. ఈ అందమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు తన అమెరికన్ స్నేహితురాలిని ఇంటికి తీసుకువస్తున్నాడు. ఆ యువకుడి కుటుంబం మొత్తం వారిని గుమ్మం వద్ద ఘనంగా స్వాగతిస్తుంది. వారు తమ కాబోయే కోడలిని ఎంతో ఆనందంతో హారతి పడుతూ, పూల వర్షం కురిపిస్తున్నారు. స్వీట్లు, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేస్తూ స్వాగతం పలుకుతారు. అది చూసిన విదేశీ మహిళ తన ప్రియుడి కుటుంబం ప్రేమను చూసి ఆనందిస్తుంది. ఇదంతా వీడియోలో రికార్డ్ చేయబడింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా, ప్రతి ఒక్కరికీ ఇలాంటి ప్రేమగల కుటుంబం ఉండాలని చాలామంది తమ అభిప్రాయాలను పంచుకోవడం గమనార్హం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..