అమ్మాయిలూ ఇది మీకోసమే.. బాయ్‌ఫ్రెండ్‌లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే

ఎప్పుడు, ఎవరు.. ఎలా ప్రేమలో పడతారో.. ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రేమకు కులం, మతం, వయసుతో అవసరం లేదు. అయితే నేటికాలం ప్రేమకు గ్యారెంటీ లేదు. చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నారు ఈనాటి లవర్స్.

అమ్మాయిలూ ఇది మీకోసమే.. బాయ్‌ఫ్రెండ్‌లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే
Viral
Follow us

|

Updated on: Jul 19, 2024 | 8:40 PM

ఎప్పుడు, ఎవరు.. ఎలా ప్రేమలో పడతారో.. ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రేమకు కులం, మతం, వయసుతో అవసరం లేదు. అయితే నేటికాలం ప్రేమకు గ్యారెంటీ లేదు. చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నారు ఈనాటి లవర్స్. అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలే కాదు.. అబ్బాయిలను మోసం చేసే అమ్మాయిలు కూడా ఈ మధ్య చాలానే చూస్తున్నాం. అయితే ముఖ్యంగా అమ్మాయిలూ.. ఇది మీకోసమే. మీ బాయ్‌ఫ్రెండ్‌లో ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అలెర్ట్ అవ్వండి.

ఇది చదవండి: చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నాడు.. తీరా మూత ఓపెన్ చేయగా

సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం:

ప్రేమలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఇది సంబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. కానీ మీరు ప్రేమించిన వ్యక్తి ప్రవర్తనలో అనూహ్యంగా మార్పు రావడం.. సన్నిహితంగా ఉండకపోవడం లాంటివి వస్తే.. అతడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే కాల్స్, మెసేజ్‌లకు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోయినా.. వారికీ మీరు ముఖ్యం కాదన్నట్టే.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అంబానీ సంపద కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెల్సా..? లెక్కలు చూస్తే షాకే

ప్రేయసిని కుటుంబసభ్యులకు, స్నేహితులకు పరిచయం చేయకపోవడం:

సాధారణంగా తను ప్రేమించిన అమ్మాయిని బాయ్‌ఫ్రెండ్ ఎవరైనా తన కుటుంబానికి పరిచయం చేస్తాడు. కానీ మీరు ప్రేమించిన అబ్బాయి మిమ్మల్ని వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పరిచయం చేయకపోతే.. ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సిందే. అతడు మిమ్మల్ని దూరం పెడుతున్నాడని గ్రహించాలి.

భవిష్యత్తు గురించి చర్చించకపోవడం:

లైఫ్ లాంగ్ కలిసుండే లవర్స్.. తమ భవిష్యత్తు గురించి ఎలప్పుడూ చర్చించుకుంటారు. కానీ ఒక అమ్మాయి తన అబ్బాయితో దీని గురించి చర్చించడానికి ప్రయత్నించినప్పటికీ, అతడు ఆ విషయాన్ని విస్మరిస్తే.. మీ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ బాయ్ ఫ్రెండ్ అనుకోవట్లేదన్నట్టే. కేవలం మీతో టైంపాస్ చేస్తున్నాడని గ్రహించండి.

స్వార్థం:

బంధం ఎప్పుడూ పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ మీ బాయ్ ఫ్రెండ్ తన గురించి మాత్రమే ఆలోచిస్తూ, మిమ్మల్ని ఉపయోగించుకుంటుంటే.. అతడు తన స్వార్థం కోసం మీతో ప్రేమ నాటకం ఆడుతున్నాడని అర్థం. కాబట్టి వారితో మీరు దూరంగా ఉండండి.

ఇది చదవండి: ముఖం ఆకృతి మీలోని సీక్రెట్స్‌ను ఈజీగా చెబుతుందట.. అదెలాగంటే.?

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి