Viral: తీరానికి కొట్టుకొచ్చిన వింత చేప.. బరువు ఎంతో తెలిస్తే షాకే.!

ఆస్ట్రేలియాలోని విక్టోరియా నైరుతి తీరానికి ఓ వింత చేప కొట్టుకొచ్చింది. భారీ సైజులో ఉన్న ఆ చేపను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.

Viral: తీరానికి కొట్టుకొచ్చిన వింత చేప.. బరువు ఎంతో తెలిస్తే షాకే.!
Viral

Updated on: May 08, 2023 | 6:45 PM

ఆస్ట్రేలియాలోని విక్టోరియా నైరుతి తీరానికి ఓ వింత చేప కొట్టుకొచ్చింది. భారీ సైజులో ఉన్న ఆ చేపను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. కేత్‌ రాంప్టన్‌, టామ్‌ రాంప్టన్‌ అనే దంపతులు మొదట ఈ భారీ చేపను బీచ్‌లో గుర్తించారు. దాదాపు రెండు మీటర్ల పొడవున్న ఆ చేప మృతి చెందింది. దాంతో తీరానికి కొట్టుకొచ్చినట్టు భావిస్తున్నారు. చేపను గుర్తించిన దంపతులిద్దరూ వెటర్నరీ డాక్టర్లే అయినా, ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి చేపను చూడలేదని పేర్కొన్నారు.

ఈ చేపపై రాంప్టన్‌ దంపతులు అధ్యయనం చేయడంతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకివచ్చాయి. ఈ చేపను ఓషన్‌ సన్‌ ఫిష్‌గా గుర్తించారు. ఈ చేపలు పరిమాణంలో భారీగా ఉన్నా ఈ సముద్ర చేపల సంఖ్యం మాత్రం చాలా తక్కువే అని పేర్కొన్నారు. ఇవి చాలా అరుదైనవి కావడంతో వీటిగురించి చాలామందికి తెలియదని, ఇవి పూర్తిగా ఎదిగితే ఒక్కోటి నాలుగు మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల వెడల్పుతో 2,500 కిలోల బరువు ఉంటాయని మెరైన్‌ బయాలజిస్టులు చెబుతున్నారు. ఇవి ఉష్ణమండల తీరాల వద్ద అరుదుగా కనిపిస్తుంటాయని వెల్లడించారు.

Follow Us