Optical illusion: ఈ యువతి గాల్లో ఎలా తేలుతోందబ్బా.? అసలు విషయం తెలిస్తే థ్రిల్‌ అవుతారు..

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విస్తృతి పెరిగిన ఈ రోజుల్లో ఇలాంటి ఎన్నో ఫొటోలకు సోషల్‌ మీడియా కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. చూసే కళ్లను మాయ చేసే ఫొటోలు ప్రతీరోజూ నెట్టింట్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పైన కనిపిస్తున్న ఈ ఫొటో చూడగానే ఓ మహిళా...

Optical illusion: ఈ యువతి గాల్లో ఎలా తేలుతోందబ్బా.? అసలు విషయం తెలిస్తే థ్రిల్‌ అవుతారు..
Optical Illusion

Updated on: Mar 08, 2024 | 2:49 PM

చూసే కళ్లను మోసం చేసే విధంగా ఉంటాయి కొన్ని ఫొటోలు. మనం చూస్తుంది నిజమా అబద్ధామా అనే అనుమానం రాకమానదు. ఇలా కన్ఫ్యూజ్‌కు గురి చేసే ఫొటోలు కొన్ని ఆర్టిషిషియల్‌గా రూపొందించినవి ఉంటే మరికొన్ని సహజంగా కూడా ఉంటాయి.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విస్తృతి పెరిగిన ఈ రోజుల్లో ఇలాంటి ఎన్నో ఫొటోలకు సోషల్‌ మీడియా కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. చూసే కళ్లను మాయ చేసే ఫొటోలు ప్రతీరోజూ నెట్టింట్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పైన కనిపిస్తున్న ఈ ఫొటో చూడగానే ఓ మహిళా ఏదో కార్పెట్‌పై స్పీట్‌ ఇస్తున్నట్లు కనిస్తోంది కదూ. అయితే సదరు మహిళ గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తుంది.

ఫొటో చూడగానే మనందరికీ ఇలాంటి భావనే కలుగుతుంది. అయితే సరిగ్గా గమనిస్తే ఆ యువతి గాల్లో తేలడం నిజం కాదు. అది కేవలం మన కళ్లు మనల్ని చేస్తున్న మోసమే. ఆప్టికల్ ఇల్యూజన్‌ భ్రమే. నిజానికి ఆ యువతి గాల్లో తేలుతోందని మనకు అనిపించడానికి కారణం కింద కనిపిస్తోన్న నీడ. యువతి నిల్చున్న కార్పెట్‌ నీడ కింద పడిందని మనం అనుకుంటున్నాం. కానీ నిజానికి అది కార్పెట్ నీడ కాదు.

అక్కడే ఏర్పాటు చేసిన ఓ జెండా నీడా. అది సరిగ్గా యువతి నిల్చున చోట కింద ఉండడమే ఆమె గాల్లో తేలుతున్నట్లు కనిపించడానికి కారణం. యువతి నిల్చున చోటు వేరే, నీడ పడిన చోటు వేరు. అయితే రెండింటిన్‌ కలిపి చూస్తే మాత్రం యువతి గాల్లో తేలుతోన్న భావన కలగకమానదు. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు థ్రిల్‌కు గురవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..