Viral: హైకింగ్‌కు వెళ్లిన టూరిస్టులుకు దూరంగా ఏవో మెరుస్తూ కనిపించాయ్.. దగ్గరికి వెళ్లి చూడగా

తవ్వకాలు జరపుతున్నప్పుడు, పురాతన నిర్మాణాలు కూల్చివేస్తున్నట్లు గుప్త నిధులు బయటపడిన దాఖలాలు చాలా ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే చెక్‌ రిపబ్లిక్‌లోని పోడ్కర్కోనోసి పర్వతాల్లో వెలుగుచూసింది. ఓ ఇద్దరు హైకర్లకు పెద్ద మొత్తంలో పురాతన సంపద దొరికింది. దాని విలువ ఎంత అంటే..?

Viral: హైకింగ్‌కు వెళ్లిన టూరిస్టులుకు దూరంగా ఏవో మెరుస్తూ కనిపించాయ్.. దగ్గరికి వెళ్లి చూడగా
Treasure (Representative image )

Updated on: May 04, 2025 | 2:32 PM

నేచర్‌ను ఎంజాయ్ చేద్దామని హైకింగ్‌కు వెళ్లిన వారికి అనుకోని సంపద కనిపించింది. చెక్ రిపబ్లిక్‌‌లో గల ఈనాశ్య పర్వతాల్లో ఈ ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు టూరిస్టులు.. పోడ్కర్కోనోసి పర్వతాల్లో హైకింగ్‌కు వెళ్లారు. వారు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుండగా.. దూరంగా ఏవో మెరుస్తూ కనిపించాయి. దగ్గరికి వెళ్లి చూడగా.. కుప్పలుగా గోల్డ్ కాయిన్స్, ఇతర బంగారు ఆభరణాలు.. కొన్ని పొగాలు బ్యాగులు ఉన్నాయి. అలా ఒక్కసారిగా అంత సొత్తును చూసిన పర్యాటకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ సొత్తు అంతా ఈస్ట్ బొహెమియన్‌ మ్యూజియంలో ఉంచారు. స్వాధీనం చేసుకున్న నాణేలు 1808 కాలానికి చెందినవిగా నిర్ధారించారు.

ఫిబ్రవరి నెలలో ఈ సొత్తు దొరికిందని.. సదరు మ్యూజియం వెల్లడించింది. లోహాల విలువ రూ.2.87 కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమాన్‌ సామ్రాజ్య కాలం నాటి ఆ కాయిన్స్ 1921 తర్వాత ఎవరైనా దాచి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సెకండ్ వరల్డ్ వార్ సమయంలో నాజీలు ఈ నిధిని దాచి ఉండొచ్చన్న ప్రచారమూ జరుగుతోంది.  దాదాపు 100 ఏళ్ల క్రితమే భూమిలో దాచి పెట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఆ సంపదను ఇంకా విశ్లేషించాలని చెబుతున్నారు. కాగా చెక్ రిపబ్లిక్ చట్టాల ప్రకారం ఈ నిధిలో 10 శాతం దాన్ని కనుగొన్న హైకర్స్‌కు దక్కే అవకాశం ఉందట.

Treasure

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి