Viral Video: అమ్మబాబోయ్.. చిచ్చాకు చుక్కలు చూపించిన ఎలుగుబంటి.. చెట్టెక్కినా కూడా..

కొన్ని జంతువులు మనుషులను చూస్తే వెంటపడటం మనం చూస్తూ ఉంటాం.. చాలా మంది బ్రతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టి ఆ జంతువులనుంచి తప్పించుకుంటూ ఉంటరు. కొంతమంది వాటి చేతిలో త్రీవ్ర గాయాలపాలవుతూ ఉంటారు.

Viral Video: అమ్మబాబోయ్.. చిచ్చాకు చుక్కలు చూపించిన ఎలుగుబంటి.. చెట్టెక్కినా కూడా..
Viral Video

Updated on: Apr 12, 2023 | 4:44 PM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు రోజూ వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని నవ్వులు పూయిస్తే మరి కొన్ని మాత్రం వెన్నులో వణుకుపుట్టిస్తాయి. ఇక కొన్ని జంతువులు మనుషులను చూస్తే వెంటపడటం మనం చూస్తూ ఉంటాం.. చాలా మంది బ్రతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టి ఆ జంతువులనుంచి తప్పించుకుంటూ ఉంటరు. కొంతమంది వాటి చేతిలో త్రీవ్ర గాయాలపాలవుతూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో చూస్తే గుండె అదరకుండా ఉండదు. ఇంతకు ఈ వీడియోలో ఏంజరిగిందంటే..

తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ వ్యక్తి పై ఎలుగు బంటి దాడి చేసింది. ఓ వ్యక్తి అడవిలో హైకింగ్ చేస్తున్న సమయంలో ఓ ఎలుగుబంటి సడన్ గా అతని ముందుకు వచ్చింది. దాంతో అతడు పరుగందుకున్నాడు. ఆ ఎలుగుబంటి అతడిని వెంబడించింది.

అతడు పక్కనే ఉన్న ఒక చెట్టు ఎక్కాడు. అయినా కూడా ఆ ఎలుగుబంటి వదిలిపెట్టలేదు. అతడిని అందుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. భయంతో కేకలు పెట్టాడు.. ఎలుగుబంటి చెట్టు ఎక్కలేదు దాంతో అతడు బ్రతికిపోయాడు. అతడు చెట్టు ఇక్కేనా కూడా అది అతడిని అందుకోవడానికి చాలా ప్రయత్నించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ  వైరల్ వీడియో పై మీరూ ఒక లుక్కేయండి.