Viral Video: బాత్రూం గోడలో కనిపించిన ఇనుప లాకర్.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

|

Dec 15, 2024 | 10:51 AM

వ్యూస్ కోసం కొందరు.. నిజంగానే దొరికినవి మరికొన్ని.. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజం.? ఏది అబద్దం అనేది చెప్పలేకపోతున్నాం. తాజాగా ఆ తరహ ఓ వీడియో..

Viral Video: బాత్రూం గోడలో కనిపించిన ఇనుప లాకర్.. తెరిచి చూడగా కళ్లు జిగేల్
Viral
Follow us on

సోషల్ మీడియాలో తరచూ రకరకాల వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. సీలింగ్‌పై కొండచిలువలు.. ఫ్రిడ్జ్‌లు, కూలర్లలో చిత్రవిచిత్రమైన ఆకారాలు కనిపిస్తుండటం.. అలాగే వాటికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి తరహ ఘటన ఒకటి తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. బాత్రూం గోడ బద్దలు కొడుతుండగా.. కనిపించింది చూసి.. అసలేం జరిగిందంటే..!

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి బాత్రూంలోని గోడను సుత్తితో పగలుగొడుతుంటాడు. టైల్స్‌ను ఒక్కొక్కటిగా పగలుగొట్టి చూడగా.. లోపల కళ్లు జిగేల్‌మనించే సీన్ దర్శనమిస్తుంది. లోపల కుప్పలు తెప్పలుగా బంగారు నాణేలు కనిపిస్తాయి. అలాగే టైల్స్‌ను పూర్తిగా తొలగిస్తే.. ఆ బంగారు కాయిన్స్ వెనుక ఓ ఇనుప బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్‌ను తెరిచేందుకు కీ కోడ్ కూడా ఉంటుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా అది తెరుచుకోదు. అందుకే దానిపై రెండు లేదా మూడు ఇటుకలు వేసి పగలగొడతాడు. చివరికి పెట్టె డోర్ కాస్త వంగిపోతుంది. లోపల చూడగా బోలెడన్ని కరెన్సీ నోట్లు కనిపిస్తాయి. అటు అక్కడే బంగారు, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్, వజ్రాలు, నగదు, చిన్న తుపాకీ కూడా కనిపిస్తాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా.. దేనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇదంతా ఏదో స్టంట్ మాదిరి ఉందని.. ‘వ్యూస్, లైకుల కోసం కావాలనే ఇలా ప్లాన్ చేశారని’ అంటున్నారు. ఇది నకిలీ బంగారం అని మరొకరు కామెంట్ చేయగా.. ఇదంతా కూడా స్క్రిప్టెడ్ వీడయోనే అని ఇంకొకరు కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి