
పంజాబ్‌లోని దోబా ప్రాంతంలోని బియాస్ ఉపనది అయిన 160 కి.మీ. పొడవైన కాళీ బీన్ నది ప్రవహిస్తోంది. ఈ నదిలో కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గృహ, పారిశ్రామిక వ్యర్థాలు కలవడంతో నీరు తాగడానికి పనికి రాకుండా పోయింది. ఇదంతా ఒక వ్యక్తి దృష్టిలో పడింది. ఎలాగైనా నదిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతనే బల్బీర్ సింగ్.
పంజాబ్‌కు చెందిన అత్యంత ప్రసిద్ధ పర్యావరణవేత్తలలో ఒకరైన బల్బీర్ సింగ్ సీచెవాల్ ని ఎకో బాబా అని కూడా పిలుస్తారు. దోబా ప్రాంతంలోని బియాస్ ఉపనది అయిన 160 కి.మీ. పొడవైన కాళీ బీన్ నది ప్రవహిస్తోంది. 2000 సంవత్సరంలో ఈ నదిలో నీరు అంతా ఇంటి నుంచి వచ్చే వ్యర్ధాలతో పాటు పారిశ్రామిక వ్యర్ధలతో నిండిపోయిందని గుర్తించాడు.
వాస్తవంగా ఈ నదిని పంజాబ్ రాష్ట్రంలో చాలా మంది పవిత్రంగా భావిస్తారు. అయితే నదిలో పడ వేసిన వ్యర్థాల కారణంగా మురికి కాలువగా మారిపోయింది.నది కొన్ని ప్రాంతాల్లో ఎండిపోయింది కూడా. ఫలితంగా స్థానికంగా ఈ నది నీటిమీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతుల పొలాలలో నీటి సమస్యలు తలెత్తింది.
అప్పుడు బల్బీర్ సింగ్ రంగంలోకి దిగాడు. నది ప్రాముఖ్యతను, శుభ్రపరచడం వలన కలిగే లాభాలను స్థానిక ప్రజలకు చెప్పడం మొదలు పెట్టారు. ఎకో బాబా సంకల్పానికి స్వచ్ఛంద సేవకులు జత అయ్యారు. దీంతో నది ని శుభ్రపరచడానికి సమీపంలోని గ్రామస్తులు మేము సైతం అన్నారు. అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి 24 కంటే ఎక్కువ గ్రామాల నివాసితులు విరాళం ఇచ్చాడు. ఇలా నిధులను సేకరించి తర్వాత నదిని శుభ్రం చేయడం ప్రారంభించారు.
గ్రామస్తులు మురుగునీటిని నదిలోకి కాకుండా వేరే చోట పారేలా చూడాలని కోరుతూ ఎకో బాబా ప్రజా అవగాహన ప్రచారాన్ని చేశారు. పరిశుభ్రమైన నదీ గర్భంతో సహజ నీటి బుగ్గలు పునరుద్ధరించబడ్డాయి. నది మళ్లీ శుభ్రమైన నీటితో నిండుగా ప్రవహించడం మొదలు పెట్టింది.
దీని తరువాత బల్బీర్ సింగ్ పంజాబ్ ప్రభుత్వ సహాయంతో భూగర్భ మురుగునీటి వ్యవస్థ నమూనాను అభివృద్ధి చేశాడు. దీంతో మురుగు నేతీ శుభ్రం చేసి వ్యవసాయంతో పాటు ఇతర ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు.
అప్పట్లో ఆయన చేసిన కృషికి దేశంలోనూ, విదేశాలలోనూ ప్రశంసలను అందుకున్నారు. ర్యావరణ పరిరక్షణకు కృషి చేయడమే కాకుండా బల్బీర్ సింగ్ వివిధ ప్రదేశాలలో పాఠశాలలు మరియు కళాశాలలను కూడా స్థాపించి నేటి తరానికి మంచి విద్యను అందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..