Viral Video: అరరే.. ఎంత పనాయే..! చేపను లటుక్కున మింగేద్దామనుకుంది.. కట్ చేస్తే సీన్ రివర్స్..

|

Mar 13, 2022 | 6:33 PM

Hawk Hunt Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి.

Viral Video: అరరే.. ఎంత పనాయే..! చేపను లటుక్కున మింగేద్దామనుకుంది.. కట్ చేస్తే సీన్ రివర్స్..
Hawk
Follow us on

Hawk Hunt Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా డేగ వేటకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిలో గద్ద.. పెద్ద చేపను వేటాడుతుంది. జంతు ప్రపంచంలో చిన్న జంతువును పెద్ద జంతువు, పెద్ద వాటిని క్రూర మృగాలు వేటాడటం సర్వసాధారణం. పక్షుల గురించి మాట్లాడుకుంటే.. ఇవి కీటకాలను తింటూ జీవిస్తుంటాయి. వాటిలో గద్ద ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జంతువు. ఇది ఆకాశం నుంసీ తన ఎరను ఎంచుకొని.. ఎగురుతూనే.. క్షణంలో దాన్ని లాక్కుపోతుంది. గద్దలు ఒక్కొసారి పిల్లలను కూడా వేటాడుతాయి. అయితే.. డేగలను సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో (social media) ఒకటి చాలా వైరల్ అవుతోంది. ఎందుకంటే..? డేగా భారీ చేపను ఎరగా ఎంచుకుంది. అయితే.. దానిని వేటాడానా..? బయటకు తీసుకురావడం డేగకు భారంగా మారింది.

ఈ వైరల్ వీడియోలో.. డేగ పెద్ద చేపను ఎలా వేటాడిందో మీరు చూడవచ్చు.. కానీ అతను దానిని తీసుకెళ్లలేకపోతోంది. ఎందుకంటే.. చేప బరువు భారీగా ఉండటంతో దానిని ఎత్తుకెళ్లేందుకు డేగ ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ దానికి సాధ్యం కావడం లేదు. శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, డేగ విఫలమవుతుంది. సాధారణంగా డేగ చిన్న జింకను కూడా పైకి లేపగలదు కానీ.. ఆ చేపను ఎందుకు ఎత్తలేకపోయిందనేది ఆలోచింపజేస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో..


ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో theplanetone అనే యూజర్ షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 90 లక్షల మంది వీక్షించారు. అయితే 1 లక్ష 24 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. అదే సమయంలో పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: గజరాజుకు కోపం వస్తే మృగరాజైనా తొకముడవాల్సిందే..! సింహాలకే సుస్సు పొయించిన ఏనుగు.. షాకింగ్ వీడియో

Watch Video: డీఆర్ఎస్ తీసుకోమంటవా.. బ్యాటర్‌నే సలహా అడిగిన పాక్ ఆటగాళ్లు.. నవ్వులు పూయిస్తోన్న వైరల్ వీడియో