సినిమా తారలు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్న రోజులివీ. కొందరు అద్దెకు తీసుకొని వెళ్తుంటే మరికొందరు ఏకంగా సొంతంగా విమానాలను కొనుగోలు చేసుకుంటున్నారు. సమాజంలో కాస్త సెలబ్రిటీ హోదా వస్తే చాలు భారీ కాన్వాయ్‌లతో, చుట్టూ పది మందితో ఆ హంగామానే వేరు. ఇక దేశ ప్రధానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ప్రధాని ఏదైనా టూర్‌కి వెళ్తున్నారంటే ప్రత్యేక విమానాల్లో వెళ్లడం సర్వసాధారణం. అలాగే ప్రధాని వెళ్తున్న మార్గాల్లో పూర్తిగా నిబంధనలను విధిస్తారు. అటుగా ఎవ్వరినీ రాకుండా చూస్తుంటారు. అలాంటి దేశ ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి అత్యంత సామాన్యుడిగా విమానంలో ప్రయాణిస్తే. అది కూడా సామాన్య జనాలతో కలిసి ప్రయణిస్తే. అది అసాధ్యం అనుకుంటున్నారు కదూ! అయితే ఇది నిజంగా జరిగింది. ఇంతకీ ఎవరా దేశ ప్రధాని, ఆయన చేసిన పనెంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఓ విమానం టేకాఫ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఫ్లైట్‌లో ప్రయాణికులు అంతా కూర్చున్నారు. అంతలోనే ఆ విమానంలోకి సాధారణ వ్యక్తిలా ఎంట్రీ ఇచ్చారు ఓ వ్యక్తి. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఇంతకీ ఆ వ్యక్తి మరెవరో కాదు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్. ఇందుకు సంబంధించిన వీడియోను.. ప్రముఖ పారిశ్రామి వేత్త హర్ష గొయెంకా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
The PM of Singapore travels on official duty aboard a low-cost airline—on a normal scheduled flight, no frills, no national or private jet, and without a large entourage at the taxpayers’ expense. This is how respect is earned. 🫡 pic.twitter.com/JHTdQnJcXi
— Harsh Goenka (@hvgoenka) October 14, 2024
ఈ వీడియోతో పాటు గొయెంకా.. ‘సింగపూర్ ప్రధాని అధికారిక కార్యక్రమంలో భాగంగా సాధారణ విమానంలో ప్రయణించారు. ప్రైవేట్ జెట్‌లో కాకుండా అత్యంత సాధారణ పౌరుడితో తోటి వ్యక్తులతో ప్రయాణిస్తున్న తీరు అద్భుతం. వ్యక్తికి అసలైన గౌరవం లభించేది ఇదిగో ఇలాగే’ అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజంగా ఒక నాయకుడు అంటే ఇలాగే ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..