Viral Video: జంప్ చేయాలని చూస్తే జాడిచ్చి తన్నిన గుర్రం.. వీడియో వైరల్..

|

Oct 19, 2021 | 7:25 AM

సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని బాధగా ఉంటాయి. కొన్ని వీడియోల్లో ఔత్సాహికులు కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు. అప్పుడప్పుడు అవి విఫలమవుతుంటాయి...

Viral Video: జంప్ చేయాలని చూస్తే జాడిచ్చి తన్నిన గుర్రం.. వీడియో వైరల్..
Hors
Follow us on

సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని బాధగా ఉంటాయి. కొన్ని వీడియోల్లో ఔత్సాహికులు కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు. అప్పుడప్పుడు అవి విఫలమవుతుంటాయి. వాటి చూస్తే మనకు నవ్వు వస్తుంది. అప్పుడు వాడికి అవసరమా ఇదీ.. బాగానే జరిగిందంటూ కామెంట్ చేస్తాం. అలాంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గుర్రంపైకి ఎక్కడానికి ఒకేసారి జంప్ చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. గుర్రం ఒకేసారి అతడిని తన్నింది. దీంతో అతను కింద పడ్డాడు. గాయాలు కూడా అయ్యాయి.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. దీనిపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎదో చేయాలనుకుంటే ఎదో అయిందిని కొందరు.. అలా చేస్తే ఇలానే అవుతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అతడు కావాలనే వీడియో వైరల్ అవడం కోసం అలా చేశాడని అంటున్నారు. అతను చేసిన అద్భుతమైన కార్క్‌స్క్రూ అని కామెంట్ చేశారు. అయితే ఈ వీడియో నాలుగు సెకండ్లే ఉండడంతో కొందరి మొత్తం వీడియో లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియరాలేదు.

Read Also.. Viral Video: పాపం పోరడు.. కోతి చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు.. ఈ వీడియో చూస్తే గంటసేపు నవ్వు ఆగదంతే..